Mon Dec 23 2024 07:50:53 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై స్పందించిన రష్మిక
టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ మీడియా సైతం ఈ జంట గురించి ఇదే చెప్తోంది. ఈ పుకార్లపై విజయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. తాజాగా రష్మిక..
హైదరాబాద్ : హీరో - హీరోయిన్ వరుసగా సినిమాల్లో నటించారంటే.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు ఇట్టే వైరల్ అవుతుంటాయి. వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, లవ్ ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని.. ఇలా అనేక రకాల పుకార్లు వస్తుంటాయి. సినిమాల్లోనే కాకుండా ఆ జంట బయట కూడా కనిపిస్తే.. ఇక ఆ పుకార్లకు అంతూ పంతూ ఉండదు. విజయ్ - రష్మిక విషయంలో కూడా అదే జరిగింది. ఇటీవల కాలంలో వీళ్లిద్దరూ బయట పార్టీలకు కలిసి వెళ్తుండటంతో.. పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది.
Also Read : పడవ ప్రమాదంలో 14 మంది మృతదేహాలు వెలికితీత..
టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ మీడియా సైతం ఈ జంట గురించి ఇదే చెప్తోంది. ఈ పుకార్లపై విజయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఇదొక పనికిమాలిన వార్త అంటూ కొట్టిపారేశాడు. తాజాగా రష్మిక మందన్న కూడా ఈ అంశంపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఈ విషయంపై మాట్లాడుతూ.. ఆ వార్తలు తన దృష్టికి కూడా వచ్చాయని, ఇలాంటి పుకార్లు తనకు కొత్తేమీ కాదని తెలిపింది. ఇలాంటి వార్తలను విని నవ్వుకోవడం అలవాటయిందని, నిజానికి వాటిని పట్టించుకునే సమయం తనకు లేదని తెలిపింది. కాగా.. మీరిద్దరూ కలిసి ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించడం లేదు. అలాంటపుడు ఇద్దరూ కలిసి ముంబైకి ఎందుకు వెళ్లారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Next Story