Mon Dec 23 2024 14:11:30 GMT+0000 (Coordinated Universal Time)
BB6: అరియానా రీ-ఎంట్రీ ? మరికొందరు మాజీ కంటెస్టెంట్లు కూడా ?
బిగ్ బాస్ 6 - 24 గంటల టెలీకాస్ట్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రానుంది. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానా రీఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
బుల్లితెరపై ఎన్ని షో లు ప్రసారమైనా.. బిగ్ బాస్ షో కు ఉండే ఆ క్రేజ్, ఆ ప్రత్యేకతే వేరు. ఈ షో ప్రసారమయ్యే 3 నెలల సమయంలో.. దాని టీఆర్పీని మరో షో బీట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయింది. 6వ సీజన్ కు మళ్లీ ఆరునెలలు వెయిట్ చేయాలనుకున్న బిగ్ బాస్ లవర్స్ కు 2022 లో షో ను ఫిబ్రవరి లేదా మార్చిలోనే ప్రారంభించనున్నట్లు నాగార్జున గ్రాండ్ ఫినాలే స్టేజీపై చెప్పకనే చెప్పేశారు. అయితే ఈసారి హిందీ సీజన్ మాదిరిగా.. తెలుగు సీజన్ ను కూడా 24 గంటలపాటు ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.
Also Read : హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
బిగ్ బాస్ 6 ..బిగ్ బాస్ 6 - 24 గంటల టెలీకాస్ట్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రానుంది.24 గంటల టెలీకాస్ట్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రానుంది. అయితే ఈ ఓటీటీ ప్రసారానికి ఇంతవరకూ యాంకర్ సెట్ కాలేదన్న టాక్ ఉంది. వారాంతంలో మాత్రం నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ 6 లోకి మాజీ కంటెస్టెంట్లు రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానా రీఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈసారి ఎలాగైనా సరే.. ట్రోఫీని దక్కించుకోవాలన్న సంకల్పంతో ఆమె హౌస్ లోకి వచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఖమ్మంజిల్లాలో పెద్దపులి సంచారం.. ఆందోళనలో ప్రజలు
అరియానాతో పాటు.. మరికొందరు బీబీ మాజీ కంటెస్టంట్లు ఓటీటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. వారిలో ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజ పేర్లు వినిపిస్తున్నాయి. కొత్త కంటెస్టంట్ల విషయానికొస్తే.. యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, 'ఢీ-10' విజేత రాజు, టిక్టాక్ స్టార్ దుర్గారావు, 'సాఫ్ట్వేర్ డెవలపర్స్'వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ లిస్ట్ లో ఎంతమంది బీబీ హౌస్ లోకి వెళ్లనున్నారో తెలియాలంటే.. మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
News Summary - Bigg boss 4 Contestant Ariyana Re Entry into Bigg boss 6 OTT
Next Story