Wed Dec 25 2024 20:04:23 GMT+0000 (Coordinated Universal Time)
ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆ జీవిని చూసి అందరూ షాక్..!
ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆ జీవిని చూసి అందరూ షాక్ అయ్యారు
సముద్రం.. ఎన్నో నిగూఢ రహస్యాలకు మూలం అని చెబుతూ ఉంటారు. సముద్రంలో మనకు తెలిసిన జీవరాశులు అతి తక్కువే.. తెలియనివి ఇంకెన్నో..! తాజాగా ఓ జీవికి చెందిన కళేబరం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. దాన్ని చూసిన వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వింతగా కనిపించే కుళ్ళిన సముద్ర జీవి యునైటెడ్ స్టేట్స్లోని తీరంలో కొట్టుకువచ్చింది. రెడ్డిట్లో వినియోగదారు క్రిస్టీన్ టిల్లోట్సన్ పోస్ట్ చేసిన చిత్రాల్లో ఈ చేప సూది లాంటి దంతాలతో, రాళ్లపై చనిపోయి పడి ఉంది. దాని శరీర భాగాలు కుళ్ళిపోయినట్లు కనిపిస్తున్నాయి. Ms టిల్లోట్సన్ ఈ జీవి ఏమిటా అని గుర్తించడంలో సహాయం కోసం అడిగారు. ఒరెగాన్లోని బ్రూకింగ్స్లోని మిల్ బీచ్లో ఆమె జంతువును చూసినట్లు తెలియజేసింది.
షేర్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది. చాలా మంది వినియోగదారులు ఈ చిత్రాలపై తమ అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. ఉత్తర పసిఫిక్ లో నివసించే వోల్ఫ్ ఈల్ అని వినియోగదారులు తెలిపారు. అయితే ఇవి వోల్ఫ్ ఈల్ జాతికి చెందినది కాదని మరికొందరు తెలిపారు. దీన్ని monkeyface prickleback eel అని అంటారని కొందరు నిపుణులు వెల్లడించారు. మంకీఫేస్ ప్రికిల్బ్యాక్ ఈల్స్ ను సాధారణంగా మంకీఫేస్ ఈల్స్ అని పిలుస్తారు, ఇవి ఉత్తర అమెరికాలోని పసిఫిక్ తీరంలో ఉంటాయి.
Next Story