Mon Dec 23 2024 09:46:35 GMT+0000 (Coordinated Universal Time)
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు.. ప్రశ్నిస్తున్న నెటిజన్లు !
ప్రముఖ బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. న్యూ ఇయర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. న్యూ ఇయర్ సందర్భంగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు మోహిత్ రైనా. తాను పెళ్లి చేసుకున్నాడన్న విషయం మోహిత్ ఎందుకు ఎవరికీ చెప్పలేదు? రహస్యంగా ఎందుకు పెళ్లిచేసుకున్నావ్ ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా.. మోహిత్ రైనా కొన్నాళ్లుగా ఒక అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయం కూడా బయటికి రాకుండా జాగ్రత్త తీసుకున్న మోహిత్.. ప్రేయసినే పెళ్లిచేసుకుని.. కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభమవుతుందంటూ పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు.
తన భార్య పేరు అదిథి అని తెలిపి, తమను ఆశీర్వదించాలని మోహిత్ సోషల్ మీడియా వేదికగా కోరగా.. సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమకు ఎటువంటి అవధులు లేవని, దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నాడు. మహాదేవ్ సీరియల్ లో శివుడి పాత్రలో అందరినీ మెప్పించిన మోహిత్.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అతను పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
Next Story