Thu Dec 19 2024 12:57:24 GMT+0000 (Coordinated Universal Time)
మొదట బైక్ పై రొమాన్స్.. ఆ తర్వాత వేడుకుంటూ
రాజస్థాన్‌లోని కోటాలో జాతీయ రహదారిపై మోటార్‌సైకిల్‌పై వేగంగా వెల్తూ రొమాన్స్ చేస్తున్న
రాజస్థాన్‌లోని కోటాలో జాతీయ రహదారిపై మోటార్‌సైకిల్‌పై వేగంగా వెల్తూ రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక వ్యక్తి, ఒక మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు, కోటా జిల్లాలోని కైతున్ పట్టణానికి చెందిన మహ్మద్ వాసిమ్ (25)గా గుర్తించారు. వీరిపై ఐపిసి సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అరెస్టు చేసిన తర్వాత, తాము చేసిన పనికి క్షమాపణలు చెప్పిన వీడియో బయటకు వచ్చింది. ప్రజల భద్రతకు హాని కలిగించే విధంగా బహిరంగంగా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వసీం ప్రజలను కోరారు.
"మోటార్‌సైకిల్ RJ 20 BF 4597 స్వాధీనం చేసుకున్నాము, ఈ ఘటనపై విచారణ జరుగుతోంది" అని కోట నగర పోలీసులు అధికారిక X హ్యాండిల్లో తెలిపారు. కదులుతున్న మోటార్ సైకిల్‌పై అసభ్యకరంగా ప్రదర్శించిన జంటను కోట సిటీ పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. మీకు సేవ చేసేందుకు కోట సిటీ పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని కూడా పోలీసులు తెలిపారు. వైరల్ వీడియోలో... బిజీగా ఉండే రోడ్డుపై ఈ జంట బైక్ పైన వెళుతోంది. యువతి బైక్ మీద పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని యువకుడికి ముద్దులు పెడుతూ కనిపించింది. ఇది కాస్తా పోలీసుల దాకా చేరడంతో కటకటాల పాలయ్యారు.
Next Story