Sun Dec 22 2024 10:55:23 GMT+0000 (Coordinated Universal Time)
ఉదయం 5 గంటలకు టాయ్ లెట్ కు వెళ్లి చూడగా..!
ఎక్కడో చెరువుల్లోనూ, నదుల్లోనో ఉండాల్సిన మొసలి ఉదయాన మీ మరుగుదొడ్డిలో కనిపిస్తే..! అలా ఓ ఇంటి మరుగుదొడ్డిలోకి 4 అడుగుల పొడవున్న మొసలి ప్రవేశించడంతో కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేసింది. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొసలిని అటవీ శాఖ అధికారులు రక్షించి చెరువులో వదిలారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలోని సోజిత్రాలోని ఖరాకువా ఎక్స్‌టెన్షన్‌లోని ఖోడియార్ మాతాజీ దేవాలయం సమీపంలో ఈ సంఘటన జరిగింది, సమీపంలోని మలతాజ్ గ్రామంలోని చెరువులో పెద్ద సంఖ్యలో మొసళ్లు నివసిస్తున్నాయి. అయితే మొసళ్లు ఎవరికీ హాని తలపెట్టినట్లు సమాచారం లేదు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోజిత్రాలోని ఖరకువా ప్రాంతంలో మొసళ్లు సంచరిస్తుంటాయి. రాత్రి ఆ ప్రాంతంలో మొసలి సంచరించడం కొంతమంది చూశారు. అనుకోకుండా ఈ మొసలి ఓ ఇంటి మరుగుదొడ్డిలోకి ప్రవేశించింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యుడు టాయిలెట్‌కు వెళ్లినప్పుడు టాయిలెట్లో మొసలిని చూసి భయపడ్డాడు. సమాచారం వెంటనే అటవీ శాఖకు చేరింది. ఇక ఆలస్యం చేయకుండా అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని మొసలిని రక్షించారు. డిప్యూటీ ఆఫీసర్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ నమ్రత డి. ఇటాలియన్ మాట్లాడుతూ.. సోజిత్రకాలోని ఖరాకువా ప్రాంతంలోని ఉడేసింగ్ రాథోడ్ ఇంటి టాయిలెట్లోకి మొసలి ప్రవేశించిందని మాకు కాల్ వచ్చింది. ఆనంద్‌కు చెందిన ప్రత్యేక అటవీ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. మొసలిని రక్షించి చెరువులో వదిలారని అన్నారు.
Next Story