Mon Dec 23 2024 04:30:30 GMT+0000 (Coordinated Universal Time)
లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి.. !
ఇన్ స్టా లైవ్ లో నెటిజన్లతో దీప్తి సునయన మాట్లాడుతుండగా.. ఓ నెటిజన్ బ్రేకప్ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటని ప్రశ్నించగా.. దీప్తి
ప్రముఖ యూ ట్యూబర్స్ షన్నూ - దీప్తి సునయనలు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా ఈ జంట రిలేషన్ లో ఉంది. సోషల్ మీడియాలో, టీవీ షోల్లో చాలాసార్లు క్లోజ్ గా కనిపిస్తూ.. తమ బంధం ఎంత గట్టిదో చెప్పకనే చెప్పారు. కానీ బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత అంతా తారుమారైంది. కారణమేదైనా కానీ.. ఆ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకోవడం.. ఎంతో మందికి బాధకలిగించింది. తాజాగా.. తమ బ్రేకప్ పై దీప్తి సునయన లైవ్ లో స్పందించింది.
ఇన్ స్టా లైవ్ లో నెటిజన్లతో దీప్తి సునయన మాట్లాడుతుండగా.. ఓ నెటిజన్ బ్రేకప్ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటని ప్రశ్నించగా.. దీప్తి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. " జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదు కదా ? ఇప్పటి వరకూ నా కెరీర్ పై దృష్టి పెట్టలేదు. ఇక నుంచైనా కెరీర్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నా.. నన్ను నేను ప్రేమించుకోవాలని అనుకుంటున్నా" అంటూ దీప్తి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Next Story