Mon Dec 23 2024 07:37:57 GMT+0000 (Coordinated Universal Time)
షాకింగ్.. దీప్తి - షన్నూ బ్రేకప్.. అధికారికంగా ప్రకటించిన దీప్తి
దీప్తి - షన్నూ లు విడిపోవడానికి బిగ్ బాస్ హౌసే కారణమంటూ.. ఆ ఇద్దరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో
అందరూ ఊహించిందే జరిగింది. కొద్దిరోజులుగా లవ్ బర్డ్స్ అయిన దీప్తి సునయన - షణ్ముఖ్ జశ్వంత్ లు విడిపోనున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆఖరికి ఈ విషయంపై దీప్తి క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవలే షన్నూ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన దీప్తి.. ఇప్పుడు మరో సుదీర్ఘ పోస్టుతో వారిద్దరూ విడిపోతున్నట్లు చెప్పేసింది.
బిగ్ బాస్ హౌసే కారణమా ?
దీప్తి - షన్నూ లు విడిపోవడానికి బిగ్ బాస్ హౌసే కారణమంటూ.. ఆ ఇద్దరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో షన్ను హౌస్ లోకి వెళ్లాక.. సిరితో క్లోజ్ గా ఉండటం, ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ తరచూ హత్తుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటి ఘటనలు జరిగాయి. షన్నూ బర్త్ డే రోజు హౌస్ లో ఉన్న అతనికోసం దీప్తి అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లడం.. అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కానీ షన్నూ.. ఎప్పటికప్పుడు సిరికి దూరంగా ఉండాలనుకుంటూనే.. మళ్లీ దగ్గరవ్వడం, ఇద్దరూ బయట వేర్వేరు వ్యక్తులతో రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయాన్ని తలచుకుంటూనే క్లోజ్ అవ్వడం.. చూసిన ఆడియన్స్ కే నచ్చలేదు. మరి షన్నూతో జీవితాన్ని పంచుకోవాలనుకున్న దీప్తి ఎలా తట్టుకుంటుంది అంటూ.. ఆమెను సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్లు.
బిగ్ బాస్ హౌస్ లో సిరి- షన్నులు క్లోజ్ ఉండటమే వారిద్దరి బ్రేకప్ కు కారణం అని నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు దీప్తి సునయన చేసిన పోస్ట్ పై సిరి హనుమంత్ స్పందించింది. ఈ విషయం తనను చాలా బాధించిందంటూ తన ఇన్ స్టా స్టోరీల్లో దీప్తి సునయన పోస్ట్ ను షేర్ చేసింది. సిరి - శ్రీహాన్ లు మాత్రం ఎప్పటిలాగానే ఉన్నారని తెలుపుతూ సిరి వారిద్దరూ కలిసున్న ఫోటోను ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.
Next Story