క్రిష్ రెండు విధాలుగా ఫెయిల్ అయ్యాడు..!
ఎంత కష్టపడితే ఏం లాభం. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలిగా. పాపం క్రిష్ వరుసగా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది ఆయన ఏకంగా మూడు [more]
ఎంత కష్టపడితే ఏం లాభం. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలిగా. పాపం క్రిష్ వరుసగా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది ఆయన ఏకంగా మూడు [more]
ఎంత కష్టపడితే ఏం లాభం. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలిగా. పాపం క్రిష్ వరుసగా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది ఆయన ఏకంగా మూడు సినిమాలు (మణికర్ణిక, ఎన్టీఆర్ రెండు భాగాలు) షూటింగ్ చేసి కంప్లీట్ చేసారు. వీటి రిజల్ట్స్ ఎలా ఉన్నా ఆర్థికంగా మాత్రం క్రిష్ ఏమాత్రం సంతృప్తిగా లేడు. ఈ మూడు సినిమాల కోసం క్రిష్ రాత్రీంబవళ్లూ కష్టపడ్డాడు. కానీ ‘మణికర్ణిక’ విషయంలో ఆయనకు ఇప్పటివరకు ఇంకా పారితోషికం అందలేదు. ఇప్పుటివరకు కేవలం 30 శాతం మాత్రమే ఇచ్చారని మిగిలిన మొత్తం అడిగితే.. మణికర్ణిక చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదట. అదే విధంగా ఎన్టీఆర్ టీం నుండి కూడా క్రిష్‌కి పూర్తి స్థాయి పారితోషికం అందలేదని తెలుస్తుంది.
రెండు పార్ట్ లు తీసినా…
ముందుగా ఈ సినిమాని ఒక్క భాగంతోనే అయిపోతుందని అనుకుని ఇంత అని ఫిక్స్ చేసుకుని తీసుకున్నాడు క్రిష్. కానీ ఇప్పుడు రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీయాల్సి వచ్చింది కాబట్టి, అనుకున్న దాని కంటే ఎక్కువ రోజులు ఈ సినిమాకి పనిచేయాల్సి వచ్చింది. కాబట్టి రెమ్యూనరేషన్ కూడా ఇస్తారు. అయితే ఆ రెమ్యూనరేషన్ ఇంతవరకు ఇవ్వలేదని టాక్. మొదటి భాగం కథానాయకుడు భారీ నష్టాలు వచ్చిన నేపథ్యంలో రెండో భాగం డిస్ట్రిబ్యూటర్స్ కి ఫ్రీగా ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కాబట్టి క్రిష్ కూడా ప్రొడ్యూసర్స్ పై జాలి పడి పారితోషికాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడట. అలా గత ఏడాది క్రిష్ కి ఆర్థికంగా.. సినిమాలపరంగా కలిసి రాలేదు.