Sun Dec 22 2024 18:09:22 GMT+0000 (Coordinated Universal Time)
Viral Video: ఘోస్ట్ రైడర్ కారు అంటూ భయంతో పరుగులు పెట్టిన జనం
ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు దూరంగా ఉండడం మనవాళ్ళు
జైపూర్‌లోని రద్దీగా ఉండే సోడాలా సబ్జీ మండిపై కారు మంటల్లో చిక్కుకుంది. అయితే అగ్నిగోళంగా మారిన కారు దూసుకురావడంతో అక్కడ ఉన్న జనం భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. ఎలివేటెడ్ రోడ్డు దగ్గర కారు వీడియోను రికార్డు చేసిన వ్యక్తులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేశారు.
కారు మంటల్లో చిక్కుకున్న తర్వాత మండి సమీపంలోని ఎలివేటెడ్ రోడ్డుపై కిందకు దూసుకు వచ్చింది. కారు వస్తోందని గమనించిన జనం తమ బైక్ లను పక్కకు తీసుకుంటూ వెళ్లిపోయారు. అయితే ఎట్టకేలకు కారు ఆగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. జితేంద్ర అనే వ్యక్తి నడుపుతున్న కారులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఘోస్ట్ రైడర్ కారు దెబ్బకు జనం పారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు దూరంగా ఉండడం మనవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో అంటూ కూడా పలువురు కామెంట్లు చేశారు.
Next Story