Mon Dec 23 2024 02:56:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్లైట్ లో వాళ్లను కోరికేసిన ప్యాసెంజర్
ఫ్లైట్ ఎక్కాక ఏమి జరుగుతుందో కానీ కొందరు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొందరు మద్యం మత్తులో రెచ్చిపోతూ ఉంటారు కూడా..! తాజాగా అలాంటి ఓ ప్యాసెంజర్ ఏకంగా ఫ్లైట్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాకుండా కొరికేశాడు కూడా.. ఏమి జరుగుతోందో కూడా తెలియక మిగిలిన ప్రయాణీకులు బిక్కమొఖం వేశారు.
ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణీకుడు విమాన సిబ్బందితో గొడవకు దిగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఇస్తాంబుల్ నుంచి జకార్తా వెళుతున్న టర్కీ ఎయిర్లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి సిబ్బందిపై పంచ్లు విసురుతున్నట్లు చూపించింది. ఇతర ప్రయాణీకులు చూస్తుండగా, ఇతర విమాన సహాయకులు గొడవను నియంత్రించడానికి పరుగెత్తుతూ కనిపించారు. ఫ్లైట్ అటెండెంట్లలో ఒకరు ప్రయాణికుడిని తన్నడం కూడా గొడవల మధ్య కనిపించింది.
జకార్తా చేరుకోవాల్సిన విమానాన్ని బలవంతంగా మలేషియాలోని కౌలాలంపూర్కు మళ్లించారు. ఇది మెడాన్లోని కౌలానాము అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. గొడవకు దిగిన వ్యక్తిని ఇండోనేషియా పౌరుడిగా గుర్తించారు. మద్యం మత్తులో అతడు సిబ్బంది వేలిని కొరికాడు. ఫ్లైట్ అటెండెంట్లు కూల్ గా ఉండాలని కోరినప్పటికీ, ఇది అతనికి మరింత కోపం తెప్పించింది. టర్కిష్ ఎయిర్లైన్స్ రిపోర్టు ప్రకారం తమ ఉద్యోగి చర్యలు కంపెనీ విలువలను ఏ విధంగానూ ప్రతిబింబించేవి కావని తెలిపింది.
Next Story