Mon Dec 23 2024 07:36:36 GMT+0000 (Coordinated Universal Time)
Samosa: ఇకపై సమోసాలు తినాలంటే.. ఇదే గుర్తుకొస్తుందేమో!!
ఎంతో ఆనందంగా కొనుక్కున్న తినుబండారాన్ని ఎంచక్కా లాగిద్దామని
ఎంతో ఆనందంగా కొనుక్కున్న తినుబండారాన్ని ఎంచక్కా లాగిద్దామని అనుకున్నప్పుడు మీకు అందులో తినకూడనిది కనిపిస్తే!! అసలు ఇక జీవితంలో ఆ పదార్థాన్ని తినకూడదని ఫిక్స్ అయిపోతారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక వ్యక్తికి అలాంటి ఘటనే ఎదురైంది. స్థానిక స్వీట్ షాప్ నుండి కొనుగోలు చేసిన సమోసాలో కప్ప కాలు కనిపించడంతో సదరు కష్టమర్ లబోదిబో మన్నాడు. అంతేకాకుండా సమోసాకు సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది.
న్యాయ్ ఖండ్లో నివసించే అమన్ కుమార్ ఒక ప్రసిద్ధ స్వీట్ షాప్ నుండి నాలుగు సమోసాలు కొన్నాడు. ఆ సమోసాలను ఇంటికి తీసుకెళ్లాడు. సమోసాను తెరిచిన వెంటనే సమోసాలలో ఒకదానిలో కప్ప కాలు కనిపించింది. ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసిన అమన్, మరికొంత మందితో కలిసి ఫిర్యాదు చేసేందుకు స్వీట్స్ దుకాణానికి వెళ్లారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షాపు యజమాని రాంకేశ్పై చర్యలు తీసుకున్నారు. అదనంగా, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం దుకాణం నుండి సమోసాల నమూనాలను సేకరించింది. శాంపిల్స్ తీసుకున్నామని, షాపు యజమానికి నోటీసు ఇచ్చామని ఫుడ్ అసిస్టెంట్ కమిషనర్ (గ్రేడ్ II) అరవింద్ యాదవ్ తెలిపారు. పరీక్ష ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Next Story