Sun Dec 22 2024 15:35:23 GMT+0000 (Coordinated Universal Time)
Gold Chain On Lord Vinayaka: 4 లక్షల విలువ చేసే బంగారు గొలుసును గణేషుడితో పాటూ నిమజ్జనం
వినాయకచవితి రోజు అలంకరించే సమయంలో కొందరు బంగారు ఆభరణాలను
గణేషుడిని వినాయకచవితి రోజు అలంకరించే సమయంలో కొందరు బంగారు ఆభరణాలను కూడా వేస్తుంటారు. అలా ఓ జంట నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును కూడా వేశారు. నిమజ్జం చేసే సమయంలో ఆ గొలుసును తీయలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి గుర్తొచ్చింది. దీంతో నిమజ్జం చేసిన నీటిలో ఆ గొలుసును వెతకడం మొదలుపెట్టారు.
కర్ణాటక రాజదాని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగర ప్రాంతంలో చవితి పండుగను రామయ్య-ఉమాదేవి దంపతులు ఘనంగా నిర్వహించారు. అలాగే విగ్రహం మెడలో ఖరీదైన బంగారు గొలుసు వేశారు. ఆ తర్వాత పత్రులతో అలంకరించడంతో గొలుసును పట్టించుకోలేదు. అనంతరం ఓ మొబైల్ ట్యాంకులో విగ్రహాన్ని నిమజ్జనం చేసేశారు. ఇంటికి తిరిగి వచ్చాక వారికి గొలుసు విషయం గుర్తుకొచ్చింది. వెంటనే నిమజ్జనం చేసిన మొబైల్ ట్యాంకు వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందికి విషయం చెప్పారు. ఓ యువకుడు విగ్రహం మెడలో గొలుసు చూశానని, కాకపోతే అది రోల్డుగోల్డుదని అనుకున్నానన్నాడు. ఆ తర్వాత పదిమంది మొబైల్ ట్యాంకులోకి దిగి గొలుసు కోసం గాలించారు. దాదాపు పది గంటల వెతుకులాట తర్వాత చైన్ దొరికింది. మొత్తం 10 వేల లీటర్ల నీటిని తోడాల్సి వచ్చింది. పోయిన చైన్ తిరిగి దొరకడంతో ఆ జంట ఊపిరి పీల్చుకుంది.
Next Story