Mon Dec 23 2024 20:20:00 GMT+0000 (Coordinated Universal Time)
అతనితో ప్రేమ నాకు ఎప్పుడూ స్పెషలే : బింధుమాధవి
కెరీర్ కోసం దూరమయ్యామని, అతను ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోగా.. నేను సినిమాల మీద మక్కువతో..
హైదరాబాద్ : బంపర్ ఆఫర్, ఆవకాయ బిర్యానీ, రామరామ కృష్ణ కృష్ణ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ బిందు మాధవి. కొన్నాళ్ల తర్వాత తెలుగులో మంచి ఆఫర్లు లేకపోవడంతో.. ప్రస్తుతం తమిళంలో నటిస్తోంది. తాజాగా.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో ఆమె కూడా ఒక కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. టాస్క్ లలో భాగంగా హౌస్ మేట్స్ అంతా తమ వ్యక్తిగత వివరాలను పంచుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో.. ఆమె తన జీవితంలో జరిగిన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది.
కాలేజీలో చదువుకునే రోజుల్లో తానొక వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. కానీ ఆ తర్వాత కెరీర్ కోసం దూరమయ్యామని, అతను ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోగా.. నేను సినిమాల మీద మక్కువతో ఇక్కడే ఉండిపోయానని బిందు మాధవి తెలిపింది. ఇప్పుడు అతనికి పెళ్లికూడా అయిపోయింది.. కానీ అతనితో ప్రేమ నాకు ఎప్పుడూ స్పెషలే అని బిందుమాధవి పేర్కొంది. అతనితో బ్రేకప్ అయిన సమయంలో తాను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, ఆ సమయంలోనే తాను తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్లానని, దాని ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడినట్లు తెలిపింది బిందుమాధవి.
Next Story