Wed Apr 02 2025 20:51:10 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమ, పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన రకుల్.. చాలాకాలంగా అతనితో డేటింగ్ లో?
ప్రముఖ సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది. ఆ మధ్య తన పుట్టినరోజు సందర్భంగా

ప్రముఖ సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది. ఆ మధ్య తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. రకుల్ - జాకీలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. కానీ.. ఇద్దరూ ఆ వార్తలపై స్పందించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేసింది. తన జీవితంలో ఇదొక అద్భుతమైన ఫేజ్ అని రకుల్ చెప్పుకొచ్చింది.
తామిద్దరం చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నామన్న ఆమె.. తమ రిలేషన్ షిప్ గురించి ఇరు కుటుంబ సభ్యులకు, స్నేహితులందరికీ తెలుసని పేర్కొంది. తామిద్దరిదీ ఒకే రంగం కావడమే కాకుండా.. ఇద్దరి ఆహారపు అలవాట్లు కూడా ఒకేలా ఉంటాయని రకుల్ తెలిపింది. తామిద్దరికీ కుటుంబాలు చాలా ముఖ్యమన్న ఈ భామ.. ఇప్పట్లో తమకు పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలిపింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు ఉండగా.. అవన్నీ పూర్తి చేశాకే పెళ్లి పీటలెక్కుతామని స్పష్టం చేసింది.
News Summary - Heroine Rakul Preet Singh is in Relationship with Bollywood Producer jackky Bhagnani
Next Story