Sat Dec 21 2024 04:45:56 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'పెళ్లి సందD' బ్యూటీ!
ప్రస్తుతం ఈ అందాల సుందరి స్టార్ హీరో రవితేజ సరసన ధమాకా సినిమాలో నటిస్తోంది. రెండో సినిమానే స్టార్ హీరో పక్కన చేయడం అంటే
గతేడాది తెలుగు తెరకి పరిచయమైన కొత్త హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే తన అభినయంతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. స్టెప్పులతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. సినిమా హిట్టా.. ఫట్టా అన్న విషయం పక్కనపెడితే.. తన క్యారెక్టర్ పరిధిలో నటించి శ్రీలీల మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ అందాల సుందరి స్టార్ హీరో రవితేజ సరసన ధమాకా సినిమాలో నటిస్తోంది. రెండో సినిమానే స్టార్ హీరో పక్కన చేయడం అంటే విశేషమే.
Also Read : మరోసారి జగన్ తో భేటీ అయిన అలీ
ఇక మూడో సినిమా ఛాన్స్ పాన్ ఇండియా స్టార్ పక్కన కొట్టేసింది. ప్రభాస్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇటీవలే దర్శకుడు మారుతి ప్రభాస్ కు కథను వినిపించగా.. దానిని రెబల్ స్టార్ ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు టైటిల్ 'రాజా డీలక్స్' ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే.. సినిమా అనౌన్స్ మెంట్ వేచి చూడాల్సింది. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాడు.
Next Story