Mon Dec 23 2024 16:11:20 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 : తెరపైకి జబర్దస్త్ ఆర్టిస్ట్ పేరు.. ఆమె ఒప్పుకుందా ?
సీజన్ 6లో పాల్గొనే కంటెస్టంట్లు వీరేనంటూ కొన్ని పేర్లు తెరమీదికి వస్తున్నాయి. తాజాగా జబర్దస్త్ ఆర్టిస్ట్ పేరు ఈ జాబితాలోకి వచ్చింది.
ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులో మొదలైన బిగ్ బాస్ షో అప్పుడే ఐదు సీజన్లను పూర్తి చేసుకుని.. ఆరవ సీజన్ కు సిద్ధమవుతోంది. మొదటి సీజన్ తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఏకైక తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ అనే చెప్పాలి. ఒక ఇల్లు, అందులోకి కొందరు కంటెస్టంట్లు.. ప్రతివారం ప్రేక్షకుల ఓటింగ్ తో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ.. ఫైనల్ గా ఒక్కరే విజేతగా నిలుస్తారు. ఈ రియాలిటీ షో లో చెప్పుకోదక్కది ఏంటంటే.. టాస్క్ లు. ఊహించని రీతిలో టాస్కులు నిర్వహిస్తారు. ఇవే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
అసలు విషయానికొస్తే.. బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని ఎక్కువ రోజులుంటే.. ఆ కంటెస్టంట్ కి బయటికి వచ్చాక అంతకంత ఫేమ్ వస్తుందని నమ్మకం. అందుకే కొత్తకొత్త వాళ్లందరినీ హౌస్ లోకి పంపిస్తుంటారు. మరో రెండు నెలల్లో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమవుతుందని నాగార్జున సీజన్ 5 గ్రాండ్ ఫినాలే రోజునే చెప్పేశారు. పైగా ఈసారి సీజన్ ను ఓటీటీలో 24 గంటలు టెలికాస్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీజన్ 6లో పాల్గొనే కంటెస్టంట్లు వీరేనంటూ కొన్ని పేర్లు తెరమీదికి వస్తున్నాయి. తాజాగా జబర్దస్త్ ఆర్టిస్ట్ పేరు ఈ జాబితాలోకి వచ్చింది.
Also Read : ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోన్న "లక్ష్య"
సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన నటి వర్ష.. ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్ట్ గా మంచిపేరు సంపాదించుకుంది. ఒక పక్క జబర్దస్త్, మరో పక్క పలు సీరియళ్లలో నటిస్తూ.. బిజీ బిజీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మేకర్స్ సీజన్ 6 కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6లోకి కంటెస్టంట్ గా వచ్చేందుకు వర్ష ఒప్పుకుందా ? లేదా? అన్నది సస్పెన్స్ లో ఉంది. ఇదిలా ఉండగా.. సీజన్ 5 లోకే వర్ష కంటెస్టంట్ గా రావాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఆ ఛాన్స్ మిస్సయింది. మరి ఈసారైనా వర్ష ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చూడాలి.
Next Story