Sat Nov 16 2024 00:22:27 GMT+0000 (Coordinated Universal Time)
లైన్మెన్ కు 500 ఫైన్ వేసిన పోలీసులు.. అతడు ఏమి చేశాడంటే..!
విద్యుత్ శాఖలో పని చేసే లైన్మెన్ తన బైక్కు చలాన్ జారీ చేయడంతో
ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని హర్దాస్పూర్ పోలీస్ స్టేషన్లో విద్యుత్ శాఖలో పని చేసే లైన్మెన్ తన బైక్కు చలాన్ జారీ చేయడంతో కోపంతో పోలీసు స్టేషన్ కు విద్యుత్తును నిలిపివేశాడు. శనివారం రాత్రి పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది.
ఈ ఘటనపై విద్యుత్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మోడీ సింగ్ అనే పోలీసు అధికారి వాహన తనిఖీ డ్రైవ్లో ఉండగా, లైన్మెన్ భగవాన్ స్వరూప్ బైక్ను ఆపి, అవసరమైన పత్రాలను సమర్పించమని కోరాడు. స్వరూప్ తన వద్ద కాగితాలు లేవని, ఇంటికి వెళ్లి వాటిని తీసుకువస్తానని చెప్పాడు. ఇన్స్పెక్టర్ అతని మాటలను పట్టించుకోకుండా రూ. 500 జరిమానా విధించాడు. ఈ సంఘటనతో స్వరూప్ చాలా కోపం తెచ్చుకున్నాడు. అతను తన సహోద్యోగులను సంప్రదించి పోలీస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరాను నిలిపివేసాడు. అయితే పోలీస్ స్టేషన్కు మీటర్ లేదని చెప్పుకొచ్చాడు. అందుకే విద్యుత్ సరఫరా కట్ చేశానని.. మీటర్ లేకుండా కరెంట్ సప్లై చేయడం చట్టవిరుద్ధమని స్వరూప్ విలేకరులకు తెలిపాడు.
News Summary - Lineman cuts off electricity supply to police station after cop fines him
Next Story