పెళ్లితోనూ డబ్బు సంపాదించడమేంటి..?
ఎవరైనా సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటున్నారు అంటే... ఆ పెళ్లి ఎలా జరుగుతుంది? ఆ పెళ్లి స్పెషల్స్ ఏమిటి? ఆ పెళ్లికి అయ్యే ఖర్చు ఎంత? ఆ పెళ్లిలో సెలెబ్రిటీ వేసుకోబోయే డ్రెస్ ఏమిటి? అలాగే ఆభరణాల మీద కూడా జనాల్లో ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి సెలబ్రిటీస్ తుమ్మినా సెన్సేషన్ గా చేసే మీడియాకి వారి పెళ్లిళ్ల విషయంలో ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండడం సహజమే. సెలబ్రిటీ పెళ్లి ఎవరిది జరిగిన గూగుల్ లో సోషల్ మీడియా లో వారి పెళ్లి ఫొటోస్ కోసం తెగ సెర్చ్ చేస్తారు అభిమానులు. అందుకే సెలబ్రిటీస్ పెళ్లీలకు ఉండే ప్రత్యేకత గురించి మీడియా గొప్పలు పోయేది.
బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిల్లు....
తాజాగా బాలీవుడ్ లో జరగబోయే రెండు పెళ్లిళ్లపైనా మీడియా ఫోకస్ పెట్టింది. దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ లు ఈ నెల 14, 15 తేదీల్లో ఇటలీలో జరగబోయే తమ పెళ్లి కోసం ఫ్లైట్ ఎక్కేసారు. వారి పెళ్లి విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ అవుతూనే ఉన్నాయి. ఇక మరో జంట ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ అమెరికాలో పెళ్లికి ముందు జరిగే తంతు కోసం వెళ్లారు. డిసెంబర్ 2న వీరి పెళ్లి జోధ్‌పూర్ లో జరగబోతుంది. ప్రస్తుతానికి జోధ్‌పూర్ లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి కూడా. అయితే కాస్ట్లీ కపుల్స్ పెళ్లి కూడా కాష్ట్లీగానే ఉండబోతుందనేది అందరికీ తెలిసిన విషయమే.
భారీ ధరలకు ఫోటోల విక్రయం....
తాజాగా ప్రియాంక - నిక్ తమ పెళ్లిని కూడా క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట. ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ తమ పెళ్లి ఫొటోలను భారీ మొత్తానికి ఒక మ్యాగజైన్ కి అమ్మినట్లుగా చెబుతున్నారు. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌కు ప్రియాంక పెళ్లి ఫోటోలను సుమారు 2.5 మిలియన్ డాలర్లకు అమ్మినట్టు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 18 కోట్ల అన్నమాట. అయితే ఆ పెళ్లి ఫోటోలను కొన్న మ్యాగజైన్ పేరైతే బయటకు రాలేదు కానీ... ప్రియాంక పెళ్లి ఫోటోలను అమ్మడం నిజమంటున్నారు.