Sun Dec 22 2024 16:43:53 GMT+0000 (Coordinated Universal Time)
89 సంవత్సరాల భర్త.. 82 ఏళ్ల భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు
తన 82 ఏళ్ల భార్యకి విడాకులు ఇవ్వాలని 89 ఏళ్ల వ్యక్తి చేసిన విజ్ఞప్తిని
తన 82 ఏళ్ల భార్యకి విడాకులు ఇవ్వాలని 89 ఏళ్ల వ్యక్తి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.(నిర్మల్ సింగ్ పనేసర్ వర్సెస్ పరమ్‌జిత్ కౌన్ పనేసర్). న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేల ఎమ్ త్రివేదిలతో కూడిన ధర్మాసనం విడాకులు ఇవ్వలేమని తెలిపింది. విడాకుల కేసులు పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో వివాహం ఇప్పటికీ పవిత్రమైనదిగా పరిగణించబడుతుందని న్యాయమూర్తులు తెలిపారు. విడాకులు తీసుకున్న మహిళ అనే కళంకంతో జీవించడం తనకు ఇష్టం లేదని భార్య అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు విడాకులు మంజూరు చేస్తే, అది భార్యకు అన్యాయం చేసినట్లేనని అభిప్రాయపడింది.
భారత సైన్యంలో పనిచేసిన భర్త జనవరి 1984లో చెన్నైలో ఉన్నప్పుడు భార్య అతనితో పాటు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఈ ఉదంతాల కారణంగా భార్యాభర్తల మధ్య బంధం చెడిపోయిందని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆమె మొదట్లో తన భర్త తల్లిదండ్రులతో, తరువాత తన కొడుకుతో ఉండాలని నిర్ణయించుకుంది. తన భార్య చెన్నైలో తనతో ఉండడానికి నిరాకరించడం, న్యాయమైన కారణాలు లేకుండా సహజీవనాన్ని వద్దనుకున్న కారణంగా భర్త విడాకులు కోరాడు. జిల్లా కోర్టు విడాకులు మంజూరు చేసినా భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈ విడాకులు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది.
నిర్మల్ సింగ్ పనేసర్ వయసు ప్రస్తుతం 89 సంవత్సరాలు. పరమ్‌జిత్ కౌర్ ను 1963లో వివాహం చేసుకున్నారు, 1996లో మొదటిసారిగా విడాకుల కోసం దాఖలు చేశాడు. 2000లో జిల్లా కోర్టు మంజూరు చేసింది, అయితే పరమ్‌జిత్ అప్పీల్ తర్వాత దానిని రద్దు చేసింది. అతని కేసు సుప్రీంకోర్టు ముందు రావడానికి మరో రెండు దశాబ్దాలు పట్టింది. ఇక్కడ విడాకుల పిటిషన్‌ను తిరస్కరించారు. విడాకులు తీసుకుందనే కళంకంతో చనిపోవాలని కోరుకోవడం లేదని కోర్టుకు తెలిపింది పరమ్‌జిత్. వృద్ధాప్యంలో తన భర్తను చూసుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పింది.
Next Story