అఖిల్ ని ఆగమంటున్న నాగ్..!
అక్కినేని నాగార్జున తన కొడుకుని వి.వి.వినాయక్ తో అఖిల్ అనే సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేసాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా [more]
అక్కినేని నాగార్జున తన కొడుకుని వి.వి.వినాయక్ తో అఖిల్ అనే సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేసాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా [more]
అక్కినేని నాగార్జున తన కొడుకుని వి.వి.వినాయక్ తో అఖిల్ అనే సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేసాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో నాగార్జున రెండో సినిమా విషయం ఎటువంటి తప్పులు జరగకూడదని చాలా జాగ్రత్తలు పడ్డారు. అందుకే తన ఫ్యామిలీకి గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన విక్రమ్ కే కుమార్ కు అఖిల్ తో చేసే ఛాన్స్ ఇచ్చాడు. హలో సినిమా తీయించాడు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కాకపోయినా ఓ మోస్తరు సినిమాగా నిలిచింది. దీంతో ఈ సినిమా కూడా అఖిల్ కి ప్లస్ కాలేకపోయింది. ఇక మరిన్ని జాగ్రత్తలు తీసుకుని హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చాడు నాగ్.
కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని…
తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ చిత్రం అందించిన వెంకీతో “మిస్టర్ మజ్ను” చేయించాడు నాగార్జున. అఖిల్ కెరీర్ కి గట్టి హిట్ అవసరంతో ఈ కాంబినేషన్ సెట్ చేసాడు. ఇది కూడా బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లా పడింది. దీంతో ఇప్పుడు నాగార్జున అఖిల్ ని కొన్ని రోజుల పాటు ఎలాంటి కథలు వినకుండా సినిమాలకు దూరంగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించాడట. తాను చెప్పేవరకు ఎటువంటి కథలు వినకూడదని చెప్పాడట. మరి ఈలోపు నాగ్ ఎటువంటి కాంబినేషన్ ని సెట్ చేస్తాడో చూడాలి.