Mon Dec 23 2024 07:37:15 GMT+0000 (Coordinated Universal Time)
నయన్ కు పెళ్లైపోయిందా ?
ఇటీవల నయనతార - విఘ్నేష్ లు ఓ అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. అక్కడ పూజ ముగించుకుని వచ్చిన నయన్ ను చూసిన జనాలు..
చెన్నై : సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ లు ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నారన్న వార్తలు నిత్యం హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వీరిద్దరూ పెళ్లిచేసుకుంటారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా.. వీరిద్దరికీ పెళ్లైపోయిందన్న విషయం తెలిసి అభిమానులు షాకవుతున్నారు. ఎవరికీ తెలియకుండా నయన్ - విఘ్నేష్ లు పెళ్లి చేసుకున్నారని, ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
ఇటీవల నయనతార - విఘ్నేష్ లు ఓ అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. అక్కడ పూజ ముగించుకుని వచ్చిన నయన్ ను చూసిన జనాలు వారికి పెళ్లైపోయిందన్న నిర్థారణకు వచ్చేశారు. అందుకు కారణం లేకపోలేదు. నయన్ నుదిటిన కుంక పెట్టుకుని కనిపించింది. అలా కుంకుమ పెట్టుకునేది పెళ్లైన ఆడవాళ్లే కాబట్టి.. నయన్ కు పెళ్లైపోయిందని, ఆ విషయాన్ని వాళ్లు దాస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story