Mon Dec 23 2024 03:10:01 GMT+0000 (Coordinated Universal Time)
దీప్తితో బ్రేకప్ పై స్పందించిన షన్ను !
షన్నూ తమ బ్రేకప్ పై స్పందించాడు. "ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆమె ఇప్పటి వరకు చాలా ఎదుర్కొంది. ఆమె
బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయిన ప్రేమ పక్షులు దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే తామిద్దరూ విడిపోతున్నట్లు దీప్తి సునయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో షన్నూ తమ బ్రేకప్ పై స్పందించాడు. "ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆమె ఇప్పటి వరకు చాలా ఎదుర్కొంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. మా దారులు వేరైనా ఒకరికొకరం సపోర్ట్ గా ఉంటాం. నేను మంచి వ్యక్తిగా ఎదిగేందుకు గత ఐదేళ్లుగా నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ దీపు" అంటూ షన్నూ తన ఇన్స్టా స్టోరీస్ లో పేర్కొన్నాడు.
ఇక ఈ ప్రేమ పక్షుల బ్రేకప్ ను జీర్ణించుకోలేకపోతున్నారు వారి అభిమానులు. అంతా సిరి వల్లే జరిగిందంటూ.. తిట్టడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఫ్యామిలీ ఎపిసోడ్ లో సిరి మదర్ వచ్చి.. మా అమ్మాయిని అలా హగ్ చేసుకోకు అని చెప్పినా.. వారిద్దరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. సగటు ప్రేక్షకుడికే ఇది నచ్చలేదంటూ.. ప్రేమించిన వ్యక్తి ఎలా తట్టుకుంటుందంటూ మరికొందరు దీప్తికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.
Next Story