Mon Dec 23 2024 11:49:26 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకప్ తర్వాత దీప్తి బర్త్ డే.. షన్నూ ఎలా విష్ చేశాడు ?
షన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక చాలా నెగిటివిటీని చూడాల్సి వచ్చింది. అందుకు కారణం ఏంటో అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా
ప్రముఖ యూ ట్యూబర్స్, లవ్ బర్డ్స్ అయిన దీప్తి సునయన - షణ్ముఖ్ జశ్వంత్ లు ఇటీవలే బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు కలిసి నటించి, కలిసి చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమపక్షుల బ్రేకప్ వారి అభిమానులను సైతం ఎంతో బాధించింది. షన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక చాలా నెగిటివిటీని చూడాల్సి వచ్చింది. అందుకు కారణం ఏంటో అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రేకప్ కు ముందే దీప్తి.. షన్ను నంబర్ ను బ్లాక్ చేయడం, సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం వంటివి చూసినప్పుడు వీరిద్దరూ విడిపోతున్నారని నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఈ విషయాన్ని న్యూ ఇయర్ కి ఒకరోజు ముందు అఫీషియల్ గా వెల్లడించింది దీప్తి.
Also Read : వర్మతో ఒరిగేదేంది? తెగేదేముంది?
బ్రేకప్ తర్వాత దీప్తి పుట్టినరోజును జరుపుకుంటోంది. జనవరి 10వ తేదీన దీప్తి పుట్టినరోజు కాగా.. షన్నూ తన ఇన్ స్టా స్టోరీస్ లో దీపుతో కలిసి దిగిన ఫోటోకు, వారిద్దరూ కలిసి నటించిన మలుపు షార్ట్ ఫిలిం లోని సాంగ్ ను జోడించి.. 'హ్యాపీ బర్త్డే D' అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లంతా షన్నూ ఇంకా దీప్తిని మరిచిపోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు దీప్తి సునయనకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.
Next Story