శ్రీను వైట్ల ప్లాన్ బెడిసికొట్టింది..!
పాపం ప్రస్తుతం శ్రీను వైట్ల పరిస్థితి అస్సలు బాగోలేదు. 'ఆగడు' నుండి స్టార్ట్ అయిన ఫ్లాప్ జర్నీ తాజాగా రిలీజ్ అయిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' వరకు కంటిన్యూ అయింది. రామ్ చరణ్ తో 'బ్రూస్లీ'కి పారితోషికం బాగానే ముట్టింది. ఆ తరువాత వరుణ్ తేజ్ తో 'మిస్టర్' సినిమాకి అంతగా పారితోషికాన్ని తీసుకోలేదు. అయితే ఇప్పుడు చేసిన 'అమర్ అక్బర్ ఆంటోనీ'లో ఏమన్నా మిగిలిందో లేదో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాలి మీకు.
లాభాల్లో వాటా కావాలని...
'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ సంస్థ వారు నిర్మించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ వారు డైరెక్టర్స్ కి ముందుగానే పారితోషికం ఇచ్చేస్తారు. అలానే శ్రీను వైట్ల కి కూడా ఇస్తుంటే లాభాల్లో వాటా కావాలని సినిమాను రూ.24 కోట్లలో పూర్తి చేస్తా అని చెప్పి స్టార్ట్ చేశాడు. మైత్రి వారు అందుకు ఓకే చెప్పి సెట్స్ మీదకు వెళ్లారు.
ఒక్క రూపాయి కూడా రాలేదా..?
ఈ సినిమాను మైత్రి ఎవరికీ అమ్మలేదు. కానీ తెలుగు శాటిలైట్, హిందీ శాటిలైట్, అమెజాన్ ప్రైమ్, డిజిటల్ రైట్స్ రూపంలో దాదాపుగా రూ.20 కోట్ల వరకూ రాబట్టుకుంది. అంటే వారికి ఇంచుమించుగా పెట్టుబడి వచ్చేసినట్టే. థియేట్రికల్ నుంచి వచ్చే డబ్బు లో సగం శ్రీను వైట్లకి ఇవ్వాలి కానీ సినిమా డిజాస్టర్ అవ్వడంతో శ్రీనుకు డబ్బు ఇవ్వలేదు మైత్రి ప్రొడ్యూసర్స్. దీంతో శ్రీనుకు ఏమీ మిగలకుండా పోయింది. తన వద్ద ఉన్న అసిస్టెంట్స్ కి కూడా శ్రీనునే డబ్బులు ఇచ్చాడని తెలుస్తుంది. వరుస సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో శ్రీను కి నెక్స్ట్ ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి.