ఏంటీ.. విక్రమార్కుడు సీక్వెలా..?
ప్రస్తుతం రాజమౌళి #RRR షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం స్టార్ట్ అయ్యి [more]
ప్రస్తుతం రాజమౌళి #RRR షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం స్టార్ట్ అయ్యి [more]
ప్రస్తుతం రాజమౌళి #RRR షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం స్టార్ట్ అయ్యి ఇంకా మూడు నెలలు కూడా అవ్వలేదు. ఇంకా హీరోయిన్స్ ని ఫైనల్ చేయలేదు. నిన్నటి నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా షూటింగ్ 20 శాతం కూడా కంప్లీట్ అవ్వకుండానే రాజమౌళి తన నెక్స్ట్ మూవీ అప్పుడే ఆలోచిస్తాడా? ఒకవేళ ఆలోచించిన 13 ఏళ్ల కిందట వచ్చిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీస్తాడని ఎవరు అనుకుంటారు. రాజమౌళి #RRR తర్వాత విక్రమార్కుడు సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నాడనే వార్త ఇవాళ చక్కర్లు కొడుతోంది. అయితే దానికి ఇప్పుడు కొనసాగింపు అనేది సరైన ఆలోచన కాదు.
సీక్వెల్ తీస్తారా..?
రవితేజ లుక్ ఇప్పుడు పూర్తి డిఫరెంట్ గా ఉంది. అదీకాక రవి ఇప్పటి వరకు చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రలు అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. రాజమౌళి ఇండియా గర్వించదగిన దర్శకుడు. అలాంటి ఆయన సీక్వెల్ లు, ప్రీక్వెల్స్ ఎందుకు తీసుకుంటూ కూర్చుంటాడు. చేస్తే ఇండియా మొత్తం చూసేలా సినిమాలు చేసే ఆలోచనలో ఉంటాడు కానీ. సో విక్రమార్కుడు సీక్వెల్ అనేది గాలి మాటగానే తీసుకోవాలి తప్పించి నిజంగా నమ్మలేనిదే. మరి ఇందులో నిజముందో లేదో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.