ఐరెన్‌లెగ్ దెబ్బకు బలైపోయిన ' ఇంటిలిజెంట్' ?
మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ మూవీ తొలి ఆటకే డిజాస్టర్ అనిపించేసుకుంది. ఈ సినిమా సాయి కెరీర్లోనే ఘోరమైన డిజాస్టర్లు అయిన తిక్క, విన్నర్ సినిమాల కంటే దారుణమైన ఫస్ట్ డే వసూళ్లు రాబట్టింది. కేవలం 2.30 కోట్ల షేర్ మాత్రమే ఇంటిలిజెంట్ సినిమాకు వచ్చింది. వినాయక్ లాంటి డైరెక్టర్ ఉండి కూడా ఈ రేంజ్ వసూళ్లు అంటే ఇండస్ట్రీ జనాలతో పాటు సినీ అభిమానులు, వినాయక్ వీరాభిమానులు సైతం షాక్ అవుతున్నారు.
ఇక ఇంటిలిజెంట్ టాక్ ఎలా ఉన్నా ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్ల నేపథ్యంలోనే ఓ బ్యాడ్ సెంటిమెంట్‌కు ఈ సినిమా బలమైపోయిందన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఓ ఐరెన్‌లెగ్ ఎఫెక్ట్ ఇంటిలిజెంట్ డిజాస్టర్‌కు కారణమైందట. ఆ ఐరెన్‌లెగ్ ఎవరో కాదు ఈ సినిమా హీరోయిన్ లావణ్య త్రిపాఠి. టాలీవుడ్లో యేడాది క్రితం వరకు లావణ్య అంటే అదిరిపోయే క్రేజ్ ఉండేది.
అయితే గతేడాది నుంచి ఆమె ఏ సినిమా చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫట్. అది మామూలు ఫట్ కాదు. 2017లో ఆమె నాలుగు సినిమాలు చేస్తూ నాలుగు డిజాస్టర్లను మించిన డిజాస్టర్లు అయ్యాయి. వరుణ్‌తేజ్‌తో మిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తే, శర్వానంద్‌తో రాధ, నాగచైతన్యతో యుద్ధం శరణం, రామ్‌తో ఉన్నది ఒక్కటే జిందగీ ఇలా అన్ని సినిమాలు ఆయా హీరోల కెరీర్లో ఘోరమైన ప్లాపులు అయ్యాయి.
ఇక నాలుగు ప్లాపుల్లో ఉన్న లావణ్యకు టాలీవుడ్ జనాలు ఐరెన్‌లెగ్ బిరుదు తగిలించేశారు. ఇప్పుడు ఇంటిలిజెంట్ కూడా డిజాస్టర్ అవ్వడంతో లావణ్య ఐరెన్‌లెగ్ ఎఫెక్ట్ ఈ సినిమా మీద బాగా పనిచేసిందన్న గుసగుసలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. మరి ఈ టైంలో లావణ్యకు మళ్లీ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారో ? చూడాలి. ఇక ఇప్పటికే నాలుగు ప్లాపులతో ఉన్న సాయిధరమ్ ఈ సినిమాతో వరుసగా ఐదో ప్లాప్ తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది.