Health Tips: పొరపాటున ఈ 5 పదార్థాలు ఇలా తినకండి.. ప్రమాదమే
కొంత మంది చాలా సార్లు ఆహారాన్ని వేడి చేసి హడావిడిగా తింటాము. ఇది ఆరోగ్యంపై తీవ్రమైన..
కొంత మంది చాలా సార్లు ఆహారాన్ని వేడి చేసి హడావిడిగా తింటాము. ఇది ఆరోగ్యంపై తీవ్రమైన, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని వైద్య నిపుణుల చెబుతున్నమాట. ఇది ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆహరాలను మళ్లీ వేడి చేసిన తర్వాత తీసుకుంటే తీవ్రమైన హాని కలిగిస్తుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మళ్లీ వేడి చేసిన తర్వాత తినకూడని చెబుతున్నారు నిపుణులు.
టీ:
టీ తయారు చేసి ఎక్కువ సేపు అలాగే ఉంచి వేడి చేసి తాగితే వెంటనే మీ ఈ అలవాటును మార్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే టీ చల్లారిన తర్వాత అందులోని పోషకాలు పోతాయి. ఇది కాకుండా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా కూడా పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. మళ్లీ వేడి చేసిన తర్వాత టీ తాగడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తిమ్మిర్లు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
పాలకూర
పాలకూర తో చేసిన వస్తువులను మళ్లీ వేడి చేసిన తర్వాత తినకూడదు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వేడి చేస్తే ఆక్సైడ్‌గా మారి ఆరోగ్యానికి హానికరం. పాలకూరను మళ్లీ వేడి చేసినప్పుడు, నైట్రో జామిన్ అనే మూలకం ఉత్పత్తి అవుతుంది. ఇది కడుపు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
వంట నునె
ఎడిబుల్ ఆయిల్‌ను మళ్లీ వేడి చేసిన తర్వాత ఎప్పుడూ తినకూడదు. ఇది చాలా ప్రమాదకరం. నూనెను మళ్లీ వేడి చేసినప్పుడు, అందులో ఉండే కొవ్వు ట్రాన్స్ ఫ్యాట్‌గా మారుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఈ నూనెలో అన్ని రకాల యాంటీఆక్సిడెంట్లు నాశనం అవుతాయి. ఇది క్యాన్సర్‌కు కారణం అవుతుంది. దీని వినియోగం కడుపు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
పుట్టగొడుగు:
పుట్టగొడుగులు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మష్రూమ్‌లో మంచి మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది, అయితే ఉడికించిన వెంటనే తినాలి. పుట్టగొడుగులతో తయారు చేసిన వాటిని మళ్లీ వేడి చేసిన తర్వాత తినకూడదు. ఈ కారణంగా, దాని ప్రోటీన్ నాశనం అవుతుంది మరియు జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది.
అన్నం
అన్నం కూడా మళ్లీ వేడి చేసిన తర్వాత తినకూడదు. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆరోగ్య నివేదికల ప్రకారం, అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అన్నం చల్లబడినప్పుడు, అందులో బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది, ఇది మళ్లీ తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
బంగాళాదుంప
బంగాళాదుంపలను నిల్వ చేయడం, మళ్లీ, మళ్లీ వేయడం చేసి తినడం క్లోస్ట్రిడియం బోటులినమ్కు కారణమయ్యే బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)