ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు ఇంట్లో పూజలు చేయకూడదా..?
మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో రకాల ఆచారాలు, పద్దతులు ఉంటాయి. ఆ ఆచారాలను పాటించడంలో భారతీయులు ప్రాధాన్యత ఇస్తుంటారు
మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో రకాల ఆచారాలు, పద్దతులు ఉంటాయి. ఆ ఆచారాలను పాటించడంలో భారతీయులు ప్రాధాన్యత ఇస్తుంటారు. పూర్వకాలంలో పెద్దలు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పటికి పాటిస్తుంటారు. రకరకాల నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయంటే అది భారతీయ సాంప్రదాయంలోనని చెప్పాలి. పూర్వ కాలం నుంచి పెద్దలు పాటిస్తున్న అంశాలు ఇప్పటికి పాటిస్తూ వస్తున్నాము. వాటి వెనుక ఉండే కారణాలు ఎవ్వరికి తెలియకపోయినా.. ఆ పద్దతులు, నడవడికలు, ఆచారాలు ఇంకా మనుగడలో ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది మొత్తం ఇంట్లో పూజలు చేయరు. అలాగే పండగలు కూడా చేసుకోరు. అయితే ఇంట్లో ఎవరైనా చనిపోతే పూజలు చేయకూడదా..? పండగలు కూడా చేయకూడదా..? ఆలయాలకు వెళ్ల కూడదా..? ఒక వేళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత ఇవన్ని చేస్తే ఏమైనా చెడు జరుగుతుందా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి పురాణాల్లో, పండితులు చెబుతున్నదేమిటి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇంట్లో ఎవరైనా చనిపోయిన సమయంలో పూజల చేయకుండా దేవుని గది తలుపులు కూడా మూసి ఉంచుతారు. వీటితోపాటు నైవేద్యాలు పెట్టడం, శుభకార్యాలు కూడా చేయరు. అయితే ఎవరైనా చనిపోతే ఇంట్లో దీపారాధన చేయడం మానేయడం అవసరం లేదంటున్నారు పండితులు. ఎందుకంటే దీపారాధన చేయని ఇల్లు స్మశానంతో సమానం. ఎప్పుడైనా దీపారాధన జరిగే చోటులోనే దేవుళ్ళు వస్తూపోతూ ఉంటారు కాబట్టి అలాంటివి మానేయూడదని చెబుతున్నారు. అంతేకాదు ప్రతి రోజు కూడా దీపం వెలిగించాలి. అప్పుడే ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యాలతో ఉంటాయని చెబుతున్నారు. ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు ముగిసిన 11 రోజుల పాటు దీపారాధన చేయడం, శుభకార్యాలు చేయడం, పూజలు చేయడం వంటివి మాత్రం చేయకూడదట. కేవలం 11 రోజులు మాత్రమే ఈ విధానాన్ని పాటించాలి తప్ప సంవత్సరం పొడవునా ఇవేమి చేయకూడదని నిబంధనలు లేవని పురానాలు చెబుతున్నాయి. 11 రోజులలో అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 12వ రోజున శుభకార్యాలు చేయవచ్చు.
ఆ రోజు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు:
ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత 11వ రోజు తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చని వేద పండితులు చెబుతున్నారు. అయితే సంవత్సరం పొడవునా ఎక్కడికి వెళ్లకూడదని, పూజలు గానీ, పండగలు గానీ, ఇంట్లో దీపారాధన చేసుకోకూడదనే నియమం ఎక్కడ లేదని చెబుతున్నారు. ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇంట్లో దేవతలు తిష్ట వేసి కూర్చుంటారు. ఇంట్లో పూజలు చేసుకోకపోవడం, దీపారాధన చేయకపోవడం, వైవేద్యాలు పెట్టకపోవం, పూజ గది తలుపులు మూసి ఉంచడం చేయడం పెద్ద తప్పు అని ఆధ్యాత్మిక అంశాలు చెబుతున్నాయి. ఇలా చేసినట్లయితే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. దోషాలు కలుగుతాయి. అందుకే అవేమి పట్టించుకోకూడదు. దీపారాధన చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే దీపారాధన చేయడం మానేయకూడదు. 11 రోజులపాటే ఈ నియమాలను పాటించాలి. తప్ప ఏడాది పాటు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. అలాగే సంవత్సరంలోపు ఇంట్లో ఏదైనా శుభాకార్యాలు చేయడం మంచిదంటున్నారు. మూఢనమ్మకాలు నమ్మడం వల్ల మనకు మనకు మనమే చెడు చేసుకోవడం తప్ప ఇంకేమి లేదని చెబుతున్నారు పండితులు.