Mon Nov 18 2024 00:14:46 GMT+0000 (Coordinated Universal Time)
న్యూరో సర్జరీలో గేమ్ ఛేంజర్.. అరుదైన శస్త్ర చికిత్స చేసిన AIG న్యూరో సర్జన్లు
భారతదేశంలో మొదటిసారి కనురెప్ప, ట్రాన్స్ ఆర్బిటల్ ఎండోస్కోపీ
భారతదేశంలో మొదటిసారి కనురెప్ప, ట్రాన్స్ ఆర్బిటల్ ఎండోస్కోపీ సర్జరీ జరిగింది. AIG న్యూరో సర్జన్లు బ్రెయిన్ ట్యూమర్ను తొలగించడానికి ఈ అరుదైన శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. ప్రఖ్యాత న్యూరో సర్జన్లు డా. అభిరామ చంద్ర గబ్బిటా, స్కల్ బేస్ సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్.సుబోధ్ రాజు, బ్రెయిన్ ట్యూమర్కి కనురెప్పల ట్రాన్స్ఆర్బిటల్ ఎండోస్కోపిక్ ఎక్సిషన్ను విజయవంతంగా నిర్వహించారు. "ఈ సంచలనాత్మక శస్త్రచికిత్స, సాంకేతికతలో మేము ముందంజలో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము" అని డాక్టర్ అభిరామ చంద్ర అన్నారు.
"ఎండోస్కోపిక్ విధానం చిన్న కోత ద్వారా కణితిని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది, చుట్టుపక్కల కణజాలాలకు తక్కువ గాయం, వేగవంతమైన వైద్య ప్రక్రియ జరుగుతుంది." అని డాక్టర్ సుబోధ్ రాజు తెలిపారు. "న్యూరో సర్జరీలో గేమ్ ఛేంజర్. ఈ సర్జరీ జరిగిన రోగి మంచి రికవరీని కనబరిచారు. 2వ పోస్ట్ ఆపరేషన్ రోజున డిశ్చార్జ్ చేయడమే కాకుండా, మచ్చ కనిపించకుండా సాధారణ స్థితికి చేరుకున్నారు. "ఇలాంటి సర్జరీలు చేయడంలో ఏఐజీ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాయి, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ముందు వరుసలో ఉన్నాయి" అని డా.డి.నాగేశ్వర రెడ్డి అన్నారు.
Next Story