రోజూ రాగి పాత్రలో నీరు తాగితే ప్రయోజనాలేంటి? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Copper Water Benefits: రాగి పాత్ర నుండి నీరు తాగడం అనేది జనాదరణ పొందుతున్న కాలానుగుణమైన పద్ధతి. రాగి పాత్రలో నీరు
Copper Water Benefits: రాగి పాత్ర నుండి నీరు తాగడం అనేది జనాదరణ పొందుతున్న కాలానుగుణమైన పద్ధతి. రాగి పాత్రలో నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పురాతన కాలం నుంచి ఆయుర్వేదం చెబుతూ వస్తోంది. రాగి గ్లాస్లో ప్రతి రోజు నీరు తాగడం వల్ల పలు వ్యాధులను తరిమికొట్టవచ్చని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది. ఈ రాగి పాత్రలో నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్నది శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించింది.
అధ్యయనాల ప్రకారం, కనీసం ఎనిమిది గంటల పాటు రాగి పాత్రలలో ఉంచిన నీరు శక్తివంతమైన సూక్ష్మజీవుల కిల్లర్‌గా మారుతుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు తరిమికొడుతుంది. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, మలబద్ధకం, ఆమ్లతను నివారించడం, జీర్ణక్రియను మరంతగా మెరుగుపడుతుంది. రాగి సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రాగి నీరు ఆక్సిడెంట్లను వేగంగా లేదా మెరుగ్గా పని చేయకుండా నియంత్రిస్తుంది. అలాగే స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రాగి నీరు కాలుష్య కారకాలను, హానికరమైన క్రిములను తొలగిస్తుంది. కడుపు చికాకును తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
హైపర్ టెన్షన్ బ్యాలెన్స్ చేస్తుంది
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, రాగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
బరువు తగ్గుతారు..
బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. రోజూ రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే.. ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాపర్‌లో శరీరంలోని కొవ్వును కరిగించే గుణాలు ఉంటాయి. తద్వారా అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు అధిక బరువు వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు.
గుండె సమస్యలకు చెక్..
జీవనశైలి మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు.. కారణంగా హైబీపీ, శరీరంలో హైకొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతున్నాయి. దీని కారణంగా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రోజూ రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల..మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులు తగ్గుతాయని, బీపీ, హార్ట్‌బీట్ అదుపులో ఉంటాయని, గుండె జబ్బులకు దూరంగా ఉంటాయని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది.
థైరాయిడ్ దూరం..
రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. సరైన మోతాదులో కాపర్ శరీరానికి అందకపోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. తద్వారా హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం..బారిన పడే అవకాశముంది. మరి, శరీరంలో కాపర్‌లేమిని పూరించాలంటే రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.