Sat Dec 21 2024 18:22:25 GMT+0000 (Coordinated Universal Time)
Orange : పుల్ల పుల్లగా.. తియ్య తియ్యగా.. నోరూరించే ఆరెంజ్ తింటే ఎంత మేలు తెలుసా?
ప్రస్తుతం మార్కెట్ లో ఆరెంజ్ పండ్లు ఊరిస్తున్నాయి. ఎక్కడ పట్టినా ఆరెంజ్ రాశులు పోసి విక్రయిస్తున్నారు
ప్రస్తుతం మార్కెట్ లో ఆరెంజ్ పండ్లు ఊరిస్తున్నాయి. ఎక్కడ పట్టినా ఆరెంజ్ రాశులు పోసి విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అయితే ఆటోల్లో అమ్ముతూ ఆరెంజ్ లను విక్రయిస్తున్నారు. ఇది ఆరెంజ్ ల కాలం. బత్తాయిలు రేటు ఎక్కువ కావడంతో ఈ సీజన్ లో ఆరెంజ్ లు తక్కువ ధరకు లభిస్తుండటంతో వాటివైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. బత్తాయి జ్యూస్ ఆరోగ్యానికి మంచిది. కానీ దాని ధర అధికం కావడంతో ఆరెంజ్ తక్కువ ధరకు లభిస్తుండటంతో దానిని జ్యూస్ చేసుకుని కొందరు, మరికొందరు మాత్రం ప్రతి రోజు ఆరెంజ్ ను తిని పోషకాలను తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తక్కువ ధరలో...
ఆరెంజ్ ఒక్కొక్కటి రెండు రూపాయల నుంచి, ఐదు రూపాయలు, పది రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. సైజును బట్టి గ్రేడింగ్ చేసి రేటును ఫిక్స్ చేస్తున్నారు. ప్రతిరోజూ ఒక ఆరెంజ్ తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఆరెంజ్ తినడంతో సి విటమన్ మన శరీరానికి పుష్కలంగా లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఫైబర్ కూడా ఆరెంజ్ లో ఎక్కువగా ఉంటుంది. దీనివలన జీర్ణ ప్రక్రియ మరింత మెరుగు పడుతుంది. ఇక చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వైద్యులు తెలిపారు. దీని వల్ల ఆకలి కూడా బాగా అవుతుందని వైద్యులు చెబుతన్నారు. అందువల్ల ఈ కాలంలో తక్కువ ధరకు లభించే ఆరెంజ్ ను తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
పండులా తింటేనే...
ఆరెంజ్ ను పండులా తినొచ్చు. జ్యూస్ లా తీసుకున్నా చాలా బాగుంటుంది. ఎక్కువ తీపి లేకుండా సరిపడా ఉండటంతో దీనిని అందరూ తినే అవకాశం ఉ:ది. అయితే ఆరెంజ్ జ్యూస్ తాగేకంటే పండులా తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో పోషకరమైన విలువలు శరీరానికి లభించి అవి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. రోజుకు ఒక ఆరెంజ్ పండు తిన్నా చాలు ఆరోగ్యం మీ వెంటే ఉంటుందని వైద్యులు చెబుతారు. జ్యూస్ కంటే పండు తినడమే మేలన్నది వైద్యుల అభిప్రాయం. అందుకే వైద్యులు సూచనల ప్రకారం ఎక్కువగా పండ్ల రూపంలోనే తీసుకుంటే మంచిది. మలబద్దకం నివారించడమే కాకుండా బరువు కూడా తగ్గేలా చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పుల్ల.. పుల్లగా.. తియ్య తియ్యగా ఉండే ఆరెంజ్ ను వదిలిపెట్టకుండా తింటారు కదూ....!
Next Story