శ్వాస తీసుకోవడంలోనూ, మింగడంలోనూ ఇబ్బందులు.. తీరా చూస్తే
బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన 72 ఏళ్ల రైతు.. శ్వాస తీసుకోవడంలోనూ, మింగడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధపడుతున్నాడు. దీంతో గంగా రామ్ ఆసుపత్రిలో అతడికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. అతని థైరాయిడ్ గ్రంథిలో కొబ్బరికాయ పరిమాణంలో కణితి ఉందని గుర్తించారు. ఈ శస్త్రచికిత్స గత నెల నిర్వహించబడింది. ఇప్పుడు అతను థైరాయిడ్ మందులతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. కణితి పరిమాణం, బరువు పరంగా ఇది ఒక ప్రత్యేకమైన కేసు అని డాక్టర్ సంగీత్ అగర్వాల్ అన్నారు. "సాధారణంగా 10-15 గ్రాముల బరువు, 3-4 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే థైరాయిడ్ గ్రంధి 18-20 సెంటీమీటర్ల కొబ్బరికాయ పరిమాణం కంటే ఎక్కువగా మారింది. అది రాయిలా గట్టిగా ఉంది" అని చెప్పుకొచ్చారు. ఈ సర్జరీలో అనేక సవాళ్లు ఉన్నాయని, ట్యూమర్‌ను తొలగించే సమయంలో రోగి గొంతును కాపాడడమే అతి పెద్దదని వైద్యులు తెలిపారు. రెండవ సవాలు ఏమిటంటే, కణితి బహుళ రక్తనాళాలతో నిండి ఉందని.. అధిక రక్తస్రావం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. "కాల్షియం సంరక్షణ, పారాథైరాయిడ్ గ్రంధులను నిర్వహించడం కూడా పెద్ద సవాలు. అయినప్పటికీ, మేము నాలుగు పారాథైరాయిడ్ గ్రంథులను విజయవంతంగా సంరక్షించగలిగాము, "అని డాక్టర్ చెప్పారు.