Diabetic Drinks: మధుమేహులకు షుగర్ పెరగకుండా సమ్మర్లో తీసుకునే డ్రింక్స్
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్ధితి వస్తుంది.
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్ధితి వస్తుంది. వేసవి తాపం తీర్చుకునేందుకు జనం పండ్ల రసాలు వంటివి తీసుకోవడం సహజం. అయితే మధుమేహులు తమ షుగర్ లెవెల్స్ పెంచని సమ్మర్ డ్రింక్స్‌ను ఎంచుకోవడం మేలు.
ఎలాంటి పండ్ల రసాన్ని తీసుకోవాలి?
ఎలాంటి పరిస్ధితులోనూ పండ్ల నుంచి తీసిన రసాన్ని మధుమేహం ఉన్నవారు తీసుకోరాదని బెంగళూర్‌కు చెందిన డైటీషియన్ నిధి నిగం హెచ్చరిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్‌లో పండులో ఉన్నంత ఫైబర్ ఉండదని, ఇలా రసాన్ని తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ సమ్మర్ పానీయాలతో మధుమేహులు తమ దాహార్తి తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు.
డయాబెటిక్ ఉన్నవారు షుగర్ లెవల్ పెరగకుండా హైడ్రేట్‌గా ఉండేందుకు కొన్ని హోమ్ రెమీడిస్ పాటించడం మంచిదంటున్నారు. కొన్ని సహజసిద్ధమైన, ఆరోగ్యకర కూలింగ్ డ్రింక్స్ తయారుచేసుకోవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు. భోజనానికి ముందు ఈ సమ్మర్ డ్రింక్స్ తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్నవారు తీసుకునే డ్రింగ్స్
☛ సబ్జా సీడ్స్‌తో కొబ్బరి నీరు
☛ చియా సీడ్ డ్రింగ్
☛ కోకుమ్ షర్బత్
☛ మజ్జిగ
☛ క్రాన్బెర్రీ జ్యూస్
☛ వెజిటబుల్స్ జ్యూస్
ఇవి మధుమేహం ఉన్నవారు షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు ఈ జ్యూస్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.