Sun Dec 22 2024 18:56:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆల్కహాల్ తక్కువగా తీసుకున్నా మీ రక్తపోటును ప్రభావితం చేస్తుందా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం , రక్తపోటు , ఊబకాయం వంటి కొమొర్బిడిటీలతో బాధపడుతున్న వ్యక్తులకు మద్యపానం..
మద్యం అలవాటు ఉన్నవారికి రక్తపోటును ప్రభావిం చేసే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న గుండెపోటు సమస్యలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా మద్యం విషయంలు జాగ్రత్తగా ఉండాలని, తక్కువ మద్యం తీసుకున్నా ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం , రక్తపోటు , ఊబకాయం వంటి కొమొర్బిడిటీలతో బాధపడుతున్న వ్యక్తులకు మద్యపానం ప్రమాద కారకంగా పరిగణించబడుతుంది. అలాగే వృద్ధాప్యం, నిశ్చల జీవనశైలిని నడిపించడం, అధిక ఉప్పు ఆహారం తీసుకోవడం వంటి ఇతర ప్రమాద కారకాలు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తేలికపాటి మద్యపానంతో హృదయనాళ ప్రమాదాలు కూడా ఉన్నాయి.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషిలోని ఫోర్టిస్ హీరానందానీ హాస్పిటల్లో డైరెక్టర్-ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ ఫరా ఇంగేల్ ఇలా వెల్లడించారు, యునైటెడ్ స్టేట్స్తో సహా వివిధ జాతులకు చెందిన 20,000 మంది పాల్గొన్న అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆల్కహాల్ క్రమం తప్పకుండా తీసుకుంటే, పురుషులు, స్త్రీలలో సిస్టోలిక్ రక్తపోటును పెంచుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇది వారి ప్రాథమిక రక్తపోటు విలువలతో సంబంధం లేకుండా ఉంటుందని,పైన పేర్కొన్న అధ్యయనం తర్వాత అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
సగటులో విశ్లేషణ చేసినప్పుడు రోజుకు 12 గ్రాముల ఆల్కహాల్ వినియోగం సిస్టోలిక్ రక్తపోటులో 1.25 mmHg పెరుగుదలకు దారితీసిందని పరిశోధకులు అధ్యయనం ద్వారా గుర్తించారు. అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం సిస్టోలిక్ రక్తపోటులో గణనీయమైన పెరుగుదలతో ముడిపడి ఉంది. 48 గ్రాముల రోజువారీ ఆల్కహాల్ వినియోగం సిస్టోలిక్ రక్తపోటులో సగటున 4.9 mmHg పెరుగుదలకు దారితీసింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ప్రకారం.. చాలా మంది పెద్దలకు, సిస్టోలిక్ రీడింగ్ 120 mmHg కంటే తక్కువగా ఉన్నప్పుడు, డయాస్టొలిక్ రీడింగ్ 80 mmHg కంటే తక్కువగా ఉన్నప్పుడు రక్తపోటు సాధారణమైనదిగా పరిగణిస్తారు. అందువల్ల వారి సిస్టోలిక్ రక్తపోటు కనీసం 130 mmHg ఉన్నప్పుడు లేదా వారి డయాస్టొలిక్ రీడింగ్‌లు 80 mmHg కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అవుతుంది.
రోగులు స్థిరంగా ఆల్కహాల్ తాగితే వారానికి 3-4 డ్రింక్స్ అయినా అది వారి రక్తపోటును పెంచుతుందని డాక్టర్ ఫరా ఇంగేల్ అన్నారు. అధిక రక్తపోటు అనేది గుండె లేదా గుండె జబ్బులకు, ధూమపానం, మధుమేహం, కొలెస్ట్రాల్, కుటుంబ చరిత్ర వంటి అనేక ఇతర విషయాలలో ప్రమాద కారకాల్లో ఒకటి. అందువల్ల, స్థిరమైన రక్తపోటును కలిగి ఉండటానికి అధిక ప్రమాదం ఉన్న రోగులు మద్యపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Next Story