Kiwi: ఎండిన కివి పండ్లతో అదిరిపోయే లాభాలు!
Kiwi: కివీ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కివీలో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయని
Kiwi: కివీ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కివీలో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయని నిపుణులు పదేపదే చెబుతుంటారు. కివీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కివీని సూపర్ ఫ్రూట్‌గా కూడా పిలుస్తారు. కివిలో విటమిన్లు బి, సి, కాపర్, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఎండిన కివిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇవి పొటాషియంను కలిగి ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు నిపుణులు. ఎండిన కివీలో విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ పుష్కలంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను..
ఇక కివి పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇది మధుమేహం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఇక క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యంతో పాటు మంచి నిద్రకు ఉపయోగపడతాయి.
బరువు తగ్గాలనుకునేవారు..
అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఎండిన కివీని ఆహారంలో చేర్చుకోవచ్చు. అవి చాలా ఫైబర్ కలిగి ఉంటాయి. ఆకలిని నియంత్రించగలవు. కేలరీలు కూడా చాలా తక్కువ. విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా మంచివి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.