Diabetes Drinks: ఉదయం పూట షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయా? ఈ 6 డ్రింక్స్‌తో అదుపులో..
మీరు టైప్-2 డయాబెటిస్తో బాధపడుతుంటే, ఏమి తినాలి..? ఏమి తినకూడదు అనేది మీ మదిలో నిరంతరం మెదులుతూ ఉంటుంది..
మీరు టైప్-2 డయాబెటిస్తో బాధపడుతుంటే, ఏమి తినాలి..? ఏమి తినకూడదు అనేది మీ మదిలో నిరంతరం మెదులుతూ ఉంటుంది. మీరు రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుకోవాలంటే మీరు ఆహారం గురించి ఆలోచించాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, మీరు ఈ 6 పానీయాలను కూడా తాగవచ్చు. చాలా సందర్భాలలో, చక్కెర స్థాయిలు ఉదయం ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఖాళీ కడుపుతో ఉదయాన్నే తీసుకోగల అనేక పానీయాలు ఉన్నాయి.
☛ ఉసిరి రసాన్ని ఉదయాన్నే తాగాలి. ఇది అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. రోజు ప్రారంభంలో ఈ పానీయం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడుతుంది.
☛ పొట్లకాయ రసం..ఈ చేదు పానీయం మీ ఆరోగ్యానికి మంచిది. పొట్లకాయ రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ హార్మోన్ ప్రభావాన్ని పెంచుతుంది.
☛ మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్ వాడకూడదు. అయితే టీ కొంచెం తీపిగా లేకపోతే తాగడానికి పెద్దగా ఇష్టపడరు. దాల్చినచెక్కతో టీ తాగవచ్చు. దాల్చిన చెక్క టీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే దాని తీపి పానీయం రుచిని పెంచుతుంది.
☛ డయాబెటిక్ రోగులలో నిద్రలేమి చాలా సాధారణం. ఈ నిద్రలేమి సమస్య చక్కెర స్థాయిని పెంచుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు, షుగర్ అదుపులో ఉండాలంటే వేడి పాలలో పసుపు కలుపుకొని తాగాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
☛ ఒక చెంచా మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని వడకట్టి మరుసటి రోజు ఉదయం సేవించండి. మెంతి నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ కూడా బయటకు వస్తాయి.
☛ వేప ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. వేప ఆకుల రసాన్ని ఉదయం పూట తీసుకుంటే అదనపు షుగర్ లెవెల్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ పానీయం శరీరంలో డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.