అవిసె గింజల వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందా? పరిశోధన ఏం చెబుతోంది?
ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల అరోగ్యంగా ఉండవచ్చంటున్నారు వైద్య నిపుణులు. నిత్య జీవితంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము. అలాగే ఈ రోజుల్లో మహిళల్లో రొమ్ము క్యాన్సన్ వెంటాడుతుంటుంది. ఈ రొమ్ము క్యాన్సర్‌లో రకరకాలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అవిసె గింజలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. బరువు తగ్గడమే కాకుండా, ఇది మన చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. అయితే దాని ప్రయోజనాల జాబితాలో కొత్త విషయం జోడించబడింది. దీని రోజువారీ ఉపయోగం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవలి పరిశోధనలో కనుగొన్నారు.
పరిశోధనలో ఏముంది?
అవిసె గింజలు పేగు సూక్ష్మజీవులు, క్షీర గ్రంధుల మైక్రోఆర్ఎన్ఏలను ప్రభావితం చేస్తాయని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్ మైక్రోబయాలజీ స్పెక్ట్రమ్‌లో ఇటీవల ప్రచురించిన నివేదిక వెల్లడించింది. వాటి ఉపయోగం రొమ్ము క్యాన్సర్‌లో పాల్గొన్న జన్యువులను నియంత్రించడంలో సహాయపడింది. తద్వారా కణాల అనియంత్రిత విస్తరణను తగ్గిస్తుంది, ఇది రొమ్ము క్యాన్సర్ ఏర్పడటానికి దారితీస్తుంది.
రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చాలా కాలంగా తెలిసిన విషయమే అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనలో అనేక రకాల ఆహారాలు చేర్చబడ్డాయి, అయితే అవిసె గింజలు రొమ్ము క్యాన్సర్‌పై అత్యంత ప్రభావవంతమైనవిగా గుర్తించారు పరిశోధకులు.
నోట్: (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)