గుండెపోటు రావొద్దంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి
ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు పెరిగిపోతున్నాయి. పూర్వకాలంలో గుండెపోటులు పెద్దగా ఉండేవి కావు. కానీ మారుతున్న ..
ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు పెరిగిపోతున్నాయి. పూర్వకాలంలో గుండెపోటులు పెద్దగా ఉండేవి కావు. కానీ మారుతున్న కాలానుగుణంగా గుండెపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందుకు కారణం జీవనశైలిలో మార్పులు. ఈ రోజుల్లో యువతల్లో కూడా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. గతంలో చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు పని భారం కారణంగా ఈ సమస్య మరింతగా పెరిగిపోతోంది. ఇటీవల గుండెపోటు కారణంగా మరణాల రేటు చాలా పెరిగింది. అయితే చిన్న వయసులోనే గుండె సమస్యలను తగ్గించుకోవాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు.
గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం:
ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. మీరు గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ప్యాక్ చేసిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, రెడ్ మీట్, వేయించిన వస్తువులకు దూరంగా ఉండండి. గుండె ఆరోగ్యం కోసం తాజా పండ్లు, కూరగాయలు, చేపలు వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.
టెన్షన్ వద్దు:
టెన్షన్ కారణంగా కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని, అనవసర ఆలోచనలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. అయితే గుండెపోటు అనేది రిలేషన్ షిప్, టెన్షన్, వర్క్ టెన్షన్ వల్ల మీకు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. అతిగా ఆలోచించడం మానుకోవాలని, సంతోషకరమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలంటున్నారు. అంతేకాకుండా 8-10 గంటలు ఒకే చోట కూర్చోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. వ్యాయామం కోసం సమయం కేటాయించండి. అందుకు సమయం లేకపోతే నడవాలి.
గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యం, ధూమపానం:
ధూమపానం, మద్యం సేవించడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ చెడు అలవాట్లను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. మీకు ఈ రకమైన వ్యసనాలు ఉంటే, మీరు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉంది.