Sleeping Tips: రాత్రి నిద్ర పట్టడం లేదా? అద్భుతమైన టిప్స్
రాత్రి వేళ నిద్ర త్వరగా పట్టకపోవడానికి లేదా సరిగ్గా పట్టకపోవడానికి చాలా కారణాలున్నాయి.
రాత్రి వేళ నిద్ర త్వరగా పట్టకపోవడానికి లేదా సరిగ్గా పట్టకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఈ కారణాల్ని తెలుసుకుని వాటిని దూరం పెడితే కచ్చితంగా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యలు బాధపడుతున్నారు. కారణంగా పడుకునే ముందు మొబైల్స్ వాడటం, రాత్రి పూట షిప్టులు, కంప్యూటర్ ముందు గడపడం, టెన్షన్ తదితర కారణాలున్నాయి.
ఫోన్ల వాడకం..
నిద్ర పట్టకపోవడానికి.. కంటినిండ నిద్ర ముంచుకొస్తున్నా పడుకోకపోవడానికి ముఖ్యమైన కారణం ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం. ఫోన్, ల్యాప్టాప్, ఐపాడ్.. ఇలా రకరకాల పేరుతో ఇవి నిద్రను పాడుచేస్తున్నాయి. ప్రస్తుతం ఇది అతి పెద్ద సమస్యగా మారింది. అయితే నిద్ర రావడానకి 2 గంటల ముందు ‘మెలటొనిన్’ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇదే నిద్ర రావడానికి ప్రధాన కారణం. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల ఈ హార్మోన్ విడుదల అనేది ఆగిపోతుంది. దీని వల్ల నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే నిద్రపోవడానికి 2 గంటల ముందే ఫోన్ను దూరం పెట్టాలని వైద్యులు చెబుతున్నారు.
పడుకునే ముందు ఇవి తినొద్దు..
పడుకునే ముందు హెవీ ఫుడ్ తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే అధిక ప్రొటీన్ ఉన్న మాంసం, బిర్యానీ లాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి అందుతుంది. జీర్ణక్రియ 50శాతం అలస్యమవుతుంది. అందుకనే రాత్రి సమయంలో తొందరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రాత్రుల్లో నిద్ర త్వరగా రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి:
➦ పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.
➦ గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.
➦ చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి.
➦ పడుకునే ముందు కాఫీ, టీలకు దూరంగా ఉండండి.
➦ రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి.
➦ రాత్రి పడుకునే ముందు కాసిని గోరువెచ్చని పాలు తాగాలి.
➦ రాత్రి నిద్రించడానికి కనీసం రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్కు దూరంగా ఉండాలి.
➦ రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు.
➦ రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయడం చాలా ముఖ్యం.
➦ ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది.