Fri Dec 20 2024 05:21:55 GMT+0000 (Coordinated Universal Time)
Guava : రుచి చూడరా? జామ.. ఆరోగ్యానికి అంతకు మించి మరేదీ లేదట
మార్కెట్ లో జామపండ్లు తాజాగా దొరుకుతున్నాయి. నాటు జామ పండ్లు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి
మార్కెట్ లో జామపండ్లు తాజాగా దొరుకుతున్నాయి. నాటు జామ పండ్లు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. ఈ సీజన్ లో పుష్కలంగా అన్ని లభించే జామపండ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు. అందుకే ఈ సీజన్ లో విరివిగా లభించే జామపండ్లను తినడం మంచిదని సూచిస్తున్నారు. జామలో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్ లో కిలో జామ పండ్లు యాభై నుంచి అరవై రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. రోజుకొక జామ పండు తింటేచాలు ఇక ఆరోగ్యం మీ వెంటే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజూ ఒకటి తింటే...
జామ పండు ను రోజూ తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇమ్యునిటీని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి మద్దతుగా నిలుస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలోనూ జామపండు సహాయ పడుతుంది. చర్య ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. దీంతో పాటు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. మొత్తం పది రకాలైన ఉపయోగాలు జామపండ్లు తినడం వల్ల మనకు ఆరోగ్యకరంగా ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా రోజుకు ఒకజామపండును తినవచ్చనిచెబుతను్నారు.
రుచికరంగా...
ప్రస్తుతం మార్కెట్ లో లభించే జామపండ్లు రుచికరంగా కూడా ఉన్నాయి. దోరగా ఉండే పండు అత్యంత తియ్యగా ఉండటమే కాకుండా ఒకటి కాదు రెండు తినాలనిపించే రుచిగా ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్థులు కూడా జామపండును తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. జామ ఆకులు కూడా మంచిపోషకాలు ఇస్తాయని అంటున్నారు. జామ ఆకులు తినడం వల్ల గుండె, జీర్ణప్రక్రియ వంటి వాటికి ఢోకా ఉండదని చెబుతున్నారు. ఈ సీజన్ లో మాత్రమే లభించే జామ పండ్లు, ఆకులు తినండి. మీ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో సురక్షితమైన జీవితాన్ని పొందే వీలుంది.
Next Story