Sun Dec 22 2024 17:58:54 GMT+0000 (Coordinated Universal Time)
Coriander : కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు.. చర్మ సంబంధిత సమస్యలకూ మంచి ఔషధం
కొత్తిమీర ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. రెండింటినీ బాగా కలపి..
ఏ కూరలోనైనా.. పులిహోర, బిర్యానీ వంటి వంటకాల్లోనైనా.. ఉల్లిపాయ ఎంత ముఖ్యమో.. ఆ వంటకాలకు మంచి టేస్ట్ రావాలంటే కొత్తిమీర కూడా అంతే ముఖ్యం. కొత్తిమీరను చాలామంది ఇష్టంగా స్వీకరిస్తే.. కొందరు మాత్రం దానిని కరివేపాకులా పక్కకు తీసేస్తారు. ఆహార పదార్థాల అలంకరణకు, కూరల్లో వాడే ఈ కొత్తిమీరలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు కొన్ని చర్మసంబంధిత సమస్యలపై కూడా కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధతత్వాలు, ఔషధ తత్వాలూ ఉంటాయి. ఒక అధ్యయనంలో కొత్తిమీర ఫుడ్ ఫాయిజనింగ్ ను నివారించడంలో అత్యంత కీలకంగా పనిచేస్తుందని తేలింది. కొత్తిమీరలో ఉండే డుడిసినాల్ అనే పదార్థం ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాని నిర్వీర్యం చేస్తుంది.
కొత్తిమీరను ప్రతి ఆహారంలో తీసుకోవడం వల్ల, కొత్తిమీర జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల.. బీపీ కంట్రోల్ అవుతుంది. రక్తంలో చక్కెల స్థాయిని తగ్గిస్తుంది. వాటిలో ఉండే యాంటి ఆక్సిడెండ్స్ శరీర కణాలను కాపాడుతుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. నాడీ వ్యవస్థపై కూడా పనిచేస్తుంది. చర్మకాంతిని పెంచుతుంది. అలాగే.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో ప్రధానంగా ఉంటున్న కొలెస్టరాల్ ను నియంత్రిస్తుంది.
చర్మ సమస్యలకు కొత్తిమీర ఫేస్ ప్యాక్స్..
ప్రతిరోజూ రాత్రి నాలుగు కొత్తిమీర ఆకులతో పెదాలపై మర్దన చేస్తే.. మృదువుగా.. గులాబీ రంగులో అందంగా కనిపిస్తాయి. అంతేకాదు.. కొత్తిమీరతో కలిపి కొన్నిరకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం ద్వారా మొటిమలు, పిగ్మెంటేషన్, డ్రై స్కిన్, బ్లాక్ హెడ్స్త తోపాటు, జుట్టు సమస్యలు పరిష్కారమవుతాయి.
కొత్తిమీర ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. రెండింటినీ బాగా కలపి ఆ తర్వాత ముఖం, మెడపై అప్లై చేయండి. ఇరవై ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు.. మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి. కొత్తిమీర ఆకులను శుభ్రం చేసి అందులోకి, కొద్దిగా అన్నం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అంటించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం ఎంతో మృదువుగా మారడమే కాకుండా చర్మం పై ఏర్పడిన మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
కొత్తిమీర ఆకులను మెత్తగా చేసి అందులో కలబంద జెల్ ని కలిపి మొహానికి రాసుకోవటం వల్ల వల్ల ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోయి, చర్మం మెరుస్తూ.. యవ్వనంగా కనిపిస్తారు. కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ పుష్కలంగా లభించడం వల్ల కంటి సమస్యలను దూరం చేసి కంటి చూపును మెరుగు పరుస్తుంది.
Next Story