Health Tips: మౌత్‌వాష్ వాడటం మంచిదేనా..?
ప్రతి రోజు మనం ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. అయితే సాధారణంగా చాలా మంది నోటీని శుభ్రంగా
ప్రతి రోజు మనం ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. అయితే సాధారణంగా చాలా మంది నోటీని శుభ్రంగా ఉంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో మౌత్‌వాష్ ఒకటి. ఒకప్పుడు విలాసంగా భావించేవారు. ఇప్పుడలా కాదు. నలుగురిలో మాట్లాడే టప్పుడు అసౌకర్యంగా ఉండకూడదన్నా ఉద్దేశంతో కొన్ని టిప్స్ పాటిస్తుంటారు. నోరు తాజాగా అనిపించాలన్నా మౌత్‌వాష్ వాడేస్తున్నారు. ఫ్లోరైడ్ జోడించిన మౌత్‌వాష్ వల్ల పళ్లకు బలమనీ, ఆల్కహాల్ కలవని మౌత్‌వాష్ వల్ల దుష్ఫలితాలు తగ్గుతాయనీ, అలొవెరా లాంటి సహజ పదార్థాలు జోడించిన మౌత్‌వాష్ మరింత ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు.
బ్యాక్టీరియాను అరికట్టేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పంటి ఎనామిల్‌ను కాపాడటంలో కూడా ఫ్లోరైడ్ కలిగిన మౌత్‌వాష్‌లు సాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇక హానికర సూక్ష్మక్రిములు ఏవైనా ఉంటే వాటిని అడ్డుకుని చిగుళ్లు గట్టిగా ఉండేలా, వాపులాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
అలాగే కొందరికి పంటి మీద కొన్ని మరకలు లాంటివి ఉంటాయి. అలాంటి మరకల్ని పోగొట్టి, మెరిసేలా చేస్తాయి. అలాగే శ్వాసలో దుర్వాసన హరించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేస్తాయి. నోటిలో ఏర్పడే పుండ్లను తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఏ మౌత్‌వాష్ వాడాలి అనే విషయాన్ని దంతవైద్యుడిని సంప్రదించిన తర్వాతే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.