Sat Nov 23 2024 02:06:22 GMT+0000 (Coordinated Universal Time)
తెల్లజుట్టుతో విసిగిపోయారా ? ఇంట్లోనే బొప్పాయి ఆకులతో ఇలా ట్రై చేసి చూడండి
పోషకాలు, విటమిన్ల లోపాల కారణంగా.. త్వరగా జుట్టుమెరిసిపోతుంది. దానిని కవర్ చేసుకునేందుకు రకరకాల హెయిర్ డై లు..
తింటున్న ఆహారంలో లోపమో, పెరుగుతున్న కాలుష్యమో లేదా రసాయనాలతో తయారు చేసిన షాంపూల వాడకం వలనో.. కారణమేదైనా గానీ.. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి యువత వరకూ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య తెల్లజుట్టు (White Hair). మన పెద్దలకైతే.. నాలుగుపదుల వయసొచ్చినా.. జుట్టు మెరిసేది కాదు. అప్పట్లో ఆరోగ్యాన్ని అంత శ్రద్ధగా చూసుకునేవారు. మరి ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. శరీరానికి తగిన పోషకాలు, విటమిన్లు అందే ఆహారం తీసుకోవడం మానేశారు. ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లకు అలవాటుపడి లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.
పోషకాలు, విటమిన్ల లోపాల కారణంగా.. త్వరగా జుట్టుమెరిసిపోతుంది. దానిని కవర్ చేసుకునేందుకు రకరకాల హెయిర్ డై లు వాడుతుంటారు. అలా కాకుండా ఇంట్లోనే ఈ రెమడీని ట్రై చేసి చూడండి. తెల్లజుట్టు తగ్గడంతో పాటు.. జుట్టు రాలడం, చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గడంతో పాటు జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుంది.
రెండు బొప్పాయి ఆకులను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని చిన్న చిన్నగా చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పేస్టులా ఉన్న ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ లో వేసి.. బొప్పాయి ఆకుల రసాన్ని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. దీనిని పక్కన ఉంచండి.
తర్వాత.. ఒక గిన్నె తీసుకుని అందులో నాలుగు బిర్యానీ ఆకులు, ఒక టేబుల్ స్పూన్ కాఫీపొడి వేసి, ఒకగ్లాసు నీరు పోసి, అరగ్లాసు అయ్యేంత వరకూ మరిగించండి. దానిని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలోకి.. హెన్నా పౌడర్ (రెగ్యులర్ మీరు వాడేది, మార్కెట్లో అందుబాటులో ఉన్నది ఏదైనా)ను అందులోకి తీసుకుని.. ముందుగా తీసుకుని ఉంచిన బొప్పాయి ఆకుల రసాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ.. ఉండలు లేకుండా కలుపుకోవాలి.
నెక్ట్స్ కాఫీపొడితో చేసిన మిశ్రమాన్ని అందులో కలిపాలి. ఇదంతా ఒక పేస్ట్ లా అవుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక రాత్రంతా(కనీసం 5గంటలు) మూత పెట్టి ఉంచాలి. ఉదయం తలకు (పొడిజుట్టు)కు మొత్తం, కుదుళ్లవరకూ ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఒక గంట తర్వాత మామూలుగా తలస్నానం చేయాలి. ఎలాంటి షాంపూ వాడకూడదు. మరుసటి రోజున జుట్టుకు నూనె పెట్టుకుని.. అప్పుడు షాంపూతో స్నానం చేయాలి. ఇలా నెలకు ఒకటి లేదా రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు తగ్గడంతోపాటు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
Next Story