Vitamin-B12: బీ 12 లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి?
ప్రస్తుతం చాలా మందిలో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఎందుకంటే జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్..
ప్రస్తుతం చాలా మందిలో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఎందుకంటే జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్, సరైన వ్యాయమం లేకపోవడం తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఫుడ్, వ్యాయమం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరికి విటమిన్ B 12 చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తేచాలా మందిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నరాల పనితీరుకు విటమిన్ బీ12 తగినంతగా ఉండాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. బీ12 లోపించినట్లయితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విటమిన్ బీ12 లోపిస్తే నీరసం, తీవ్ర అలసట, పనులు సరిగ్గా చేసుకోలేని విధంగా ఇబ్బందిగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
ఇక బీ 12 విటమిన్ లోపిస్తే శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తలెత్తడం. శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యం తగ్గిపోవడం లాంటివి జరుగుతుంటుంది. ప్రేవుల సామర్ద్యం తగ్గిపోవడంతో అజీర్తి, మలబద్ధకం సమస్య, డయేరియా వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.అంతేకాకుండా నాడీ వ్యవస్థ పనితీరుకు విటమిన్ బీ12 ముఖ్యమైనదని నిపుణులు సూచిస్తున్నారు.
కాళ్లలో తిమ్మిర్లు:
బీ12 లోపం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, సూదితో గుచ్చిన అనుభూతి కలుగుతుందని, అలాగే హృద్రోగ ముప్పునకు విటమిన్ బీ12 లోపం దారితీస్తుందని అంటున్నారు. విటమిన్ బీ12 లెవెల్స్ మెరుగుపడాలంటే బీ12 అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్యులు. మాంసం, చేపలు, సీఫుడ్, పాల ఉత్పత్తులు, గుడ్లు, సిరిల్స్ అధికంగా తీసుకోవాలి. బీ12 సప్లిమెంట్లు అవసరం.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)