Protein: రోజుకు శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరం?
Protein: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ప్రోటీన్ కూడా చాలా ముఖ్యం. శరీరంలో కండరాలు బలంగా తయారు
Protein: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ప్రోటీన్ కూడా చాలా ముఖ్యం. శరీరంలో కండరాలు బలంగా తయారు కావాలన్నా.. వాటి పనితీరు మెరుగ్గా ఉండాలన్నా ప్రోటీన్ చాలా అవసరం. ఒక వేళ కండరాలు దెబ్బతంటే తిరిగి కోలుకోవాలన్న కూడా ప్రోటీన్ చాలా అవసరం. శరీరంలో ప్రోటీన్ లోపిస్తే సమస్య తలెత్తుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రోటీన్ తీసుకోవాలి. మనిషి బరువులో ప్రతి కిలో బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరమని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ వెల్లడించింది. అయితే ఆహార నాణ్యత, తీసుకునే ఆహారంలో ప్రోటీన్ తగినంత లేకపోవడం తదితర అంశాల కారణంగా చాలామందిలో ప్రోటీన్ లోపం ఏర్పడుతోంది.
నిజానికి ప్రోటీన్ సప్లిమెంట్లు అనేవి మొదట క్రీడాకారులు, బాడీబిల్డర్ల కోసం తయారుచేసినవి. వారి కండరాల సామర్థ్యం మెరుగ్గా ఉండేందుకు, ఆటలలోనూ, వ్యాయామాల కారణంగా వారి కండరాలు బాగా అలసిపోతాయనే ఉద్దేశంతో తయారు చేసినవే ప్రోటీన్ సప్లిమెంట్లు. చాక్లెట్, వెనిల్లా, సాల్టెడ్ కారామెల్, బర్త్ డే కేక్ వంటి రుచులతో ప్రోటీన్స్ షేక్స్ ఇప్పట్లో మరింత రుచికరంగా మారాయి. ప్రోటీన్ బ్రాండ్లు కొత్త రుచుల రూపంలో ప్రోటీన్ షేక్స్ తయారీ మీద ఫోకస్ పెట్టినట్టు ప్రోటీన్ షేక్ బ్రాండ్ వ్యవస్థాపకుడు అర్జున్ పటేల్ అన్నారు. బియ్యం, బఠానీ, జనపనార, సోయా ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ల తయారీ విస్తృతంగా జరుగుతోందన్నారు. ప్రోటీన్ బ్రాండ్లు తమ ఉత్పత్తులు మెరుగ్గా ఉండేందుకు కొల్లాజెన్, ప్రోబయోటిక్స్, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ప్రోటీన్ పౌడర్లు, షేక్స్ ను ప్రోటీన్ బ్రాండ్లు ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి అంటున్నారు నిపుణులు.
అయితే ప్రోటీన్ బ్రాండ్లు, ప్రోటీన్ సప్లిమెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తున్నప్పటికీ, వీలైనంతవరకు తాజా ఆహారం నుండి ప్రోటీన్ పొందడం ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. అందుబాటులో ఉండే రోజువారీ ఆహారం నుండే ప్రోటీన్ పొందవచ్చు. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటుంది. ప్రోటీన్ తీసుకోవడం మీ జీవక్రియ రేటును పెంచుతుంది. కొవ్వు లేదా కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అధిక ప్రోటీన్ తీసుకోవడం కండరాలు, బలాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
నడక, పరుగు, స్విమ్మింగ్, మరేదైనా వ్యాయామం వంటి శారీరక శ్రమతో కూడుకున్నది కాబట్టి ప్రోటీన్ చాలా అవసరం. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాలి. అథ్లెట్లకు అధిక మొత్తంలో ప్రోటీన్ అవసరం. రోజుకు కిలోకు 1.2-1.4 గ్రాముల ప్రోటీన్ అవసరం అంటున్నారు. ప్రోటీన్ తీసుకోవడం రక్తపోటును తగ్గిస్తుంది. మధుమేహంతో పోరాడటానికి సహాయపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన బరువుతో ఉండి, వ్యాయామం చేయనట్లయితే కిలోకు 0.8-1.3 గ్రాముల ప్రోటీన్ మంచి ఎంపిక. ఆరోగ్యకరమైన మగవారికి రోజుకు 56-91 గ్రాములు, ఆరోగ్యకరమైన స్త్రీకి రోజుకు 46-75 గ్రాముల ప్రోటీన్ కావాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.