అధిక రక్తపోటును ఎలా నియంత్రించాలి?
ప్రస్తుతం కాలంలో గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అధిక ఒత్తిడి, ఇతర టెన్షన్స్, నిద్రలేమి, సరైన వ్యాయామం..
ప్రస్తుతం కాలంలో గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అధిక ఒత్తిడి, ఇతర టెన్షన్స్, నిద్రలేమి, సరైన వ్యాయామం లేకపోవడం, ఆహార నియమాలు, ఇలా జీవన శైలి కారణంగా ఆనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వాటిని అధిక మించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదు. ముఖ్యంగా మన జీవన శైలిలో మార్పులు తీసుకురావడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నమాట. ఇక ముఖ్యంగా ఇటీవల నుంచి గుండె పోటు వ్యాధులు, ఇంకా గుండెకు సంబంధించిన సమస్యలతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో చాలా మందికి బీపీ ఉంటుంది. డయాబెటిస్, ఇతర సమస్య ఉన్నవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు నుంచి కాపాడుకునేందుకు కొన్ని పద్దతులను అనుసరించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.
☛ శారీరక శ్రమను పెంచండి: సాధారణ శారీరక శ్రమ రక్తపోటును తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ కోసం కృషి చేయండి. ప్రతిరోజు వ్యాయామం, వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు రాకుండా సహాయపడతాయి. గుండె యాక్టివ్గా పని చేస్తుంది. మీ శరీరం బరువు పెరగకుండా ఉండడమే కాకుండా గుండె సమస్యలను రాకుండా కాపాడుకోవచ్చు.
☛ ఆల్కహాల్ పరిమితం చేయండి: మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఆల్కహాల్ మీ రక్తపోటును పెంచుతుంది. మీరు మద్యం తాగాలని ఎంచుకుంటే మితంగా చేయండి. లేదంటే మద్యానికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. అలాగే బయట నూనెలో వేయించిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
☛ ధూమపానం చేయవద్దు: పొగాకు రక్తనాళాల గోడలను గాయపరుస్తుంది. అలాగే ధమనుల గట్టిపడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు మానేయడం మంచిది. దీని వల్ల క్యాన్సర్తో పాటు గుండె సమస్యలను పెంచుతుంది.