ప్రతిరోజూ గుడ్డుతినడం ఆరోగ్యానికి మంచిదేనా ?
చాలామంది తమ డైట్ లో భాగంగా గుడ్లు(Eggs) ఎక్కువగా తీసుకుంటుంటారు. ప్రతిరోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? రోజుకు..
ప్రస్తుతం ఆరోగ్యం గురించి చెప్పుకోవాలంటే.. కరోనాకి ముందు కరోనా తర్వాత అని చెప్పాల్సిన పరిస్థితి. దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించిన నేపథ్యంలో.. అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితమైన డైట్ పాటించాల్సిందే. ప్రతి నిత్యం వ్యాయామాలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ధృడంగా ఉంటుంది.
అలాగే అధికంగా గుడ్లు తినడం వల్ల.. డైట్ మాట పక్కనపెడితే ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది. బరువు తగ్గేందుకు డైట్ లో భాగంగా తీసుకునే గుడ్లు.. మోతాదు పెరిగితే హాని తప్పదంటున్నారు. నిజానికి గుడ్డులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.. ఎక్కువ మోతాదులో గుడ్లు తినడం వల్ల శరీరంలో కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి డైట్ లో గుడ్లను ఖచ్చితంగా తీసుకునేవారు.. రోజుకి రెండు గుడ్లు మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే ప్రతిఒక్కరూ రోజుకి కనీసం ఒకగుడ్డునైనా తినాలని వైద్యుల సూచన.