మీ మొబైల్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటున్నారా..? జాగ్రత్త..
స్మార్ట్‌ఫోన్ రోజువారీలో ఒకభాగంగా మారిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిది ఉండని పరిస్థితి నెలకొంది.
మీ మొబైల్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటున్నారా..? జాగ్రత్త..
స్మార్ట్‌ఫోన్ అనేది రోజువారీలో ఒకభాగంగా మారిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిది ఉండని పరిస్థితి నెలకొంది. అయితే ఫోన్‌ను వాడే విధానంలో కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి. సామాజిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రజలు ఎక్కువగా వినోద ప్రయోజనాల కోసం స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తారు. దీని వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో తెలిసినా.. చాలా మంది మొబైల్ ఫోన్లను వదులుకోవడం లేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు మొబైల్ఫోన్లతోనే గడిపేస్తున్నరోజులివి. తమ మొబైల్‌ని 24 గంటలూ తమ దగ్గరే ఉంచుకుంటారు. మహిళలు తమ ఫోన్లను పర్సులు లేదా బ్యాగ్‌లలో ఉంచుతారు. అయితే పురుషులు తమ ఫోన్లను ప్యాంటు జేబులో పెట్టుకుంటారు. మొబైల్ ఫోన్లను ప్యాంట్ జేబుల్లో పెట్టుకోవడం వల్ల ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ద్వారా వెలువడే రేడియేషన్ వల్ల ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుందని తెలిసినా చాలా మంది పురుషులు తమ మొబైల్ ఫోన్లను జేబులో పెట్టుకోవడం అనివార్యమైంది. ఈ సందర్భంగా ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోరు. ప్రమాదాన్ని తగ్గించడానికి మొబైల్ ఫోన్లను పెట్టుకునేందుకు పురుషుల ప్యాంటులో ఏ పాకెట్ ఉత్తమమో చూద్దాం.
జేబులో ఫోన్ పెట్టుకోవడం ఆరోగ్యానికి హానికరం:
మీ జేబులో వైర్లెస్ నెట్వర్క్కి కనెక్ట్ చేయబడిన ఫోన్ ఉన్న శరీరం 2 నుంచి 7 రెట్లు ఎక్కువ రేడియేషన్‌కు గురవుతుంది. ఈ రేడియేషన్లు మనిషి ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫోన్ రేడియేషన్ కూడా క్యాన్సర్‌కు కారణమవుతుందని సూచిస్తున్నారు. ఈ రేడియేషన్లు మీ DNAపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది అనేక ఆరోగ్య ప్రమాదాలకు దారి తీస్తుంది. మరోవైపు చొక్కా జేబులో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే ఫోన్ జేబులో పెట్టుకోవడం వల్ల మన ఎముకలు ముఖ్యంగా తుంటి ఎముకలు బలహీనపడతాయి.
స్పెర్మ్ ఆరోగ్యంపై ఎఫెక్ట్
పురుషులు తమ ముందు జేబులో మొబైల్ ఉంచుకుంటే, అది స్పెర్మ్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. ఫోన్‌ని మీ పర్సు లేదా బ్యాగ్‌లో ఉంచుకోవడం ఉత్తమ మార్గం. చాలామందికి ఇది సాధ్యం కాదు. ఇలాంటప్పుడు ఫోన్‌ని ప్యాంట్ ముందు జేబులో పెట్టుకోకుండా వెనుక జేబులో పెట్టుకోండి. అలాగే గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. మొబైల్ ఫోన్ వెనుక భాగం పైకి ఎదురుగా ఉండాలి. ఇది మీ చర్మానికి అంటిపెట్టినట్లుగా ఉండకూడదు. దీని కారణంగా రేడియేషన్ శరీరంలోకి వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందువల్ల, మొబైల్ ఫోన్‌ను వెనుక జేబులో ఉంచడం ద్వారా, మీరు మీ ఆరోగ్యానికి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే స్మార్ట్‌ఫోన్‌ను అవసరానికి మాత్రమే ఉపయోగించి తర్వాత దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో అవసరం లేని సమయంలో కూడా ఫోన్లతోనే గడిపేస్తున్నారు. దీని వల్ల కంటిపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.