Fri Mar 14 2025 23:40:29 GMT+0000 (Coordinated Universal Time)
kidneys : మూత్రపిండాలు మీకు సరిగా పనిచేస్తున్నాయా? ఈ లక్షణాలున్నాయా?
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మూత్రపిండాలు దెబ్బతింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే నిరంతరం వీటిని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం, పోషకాలను సమతుల్యం చేయడం వంటి అనేక బాధ్యతలను కిడ్నీలు నిర్వహిస్తాయి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన మీ కోసం. మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రపరిచి, అవశేషాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తాయి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను (సోడియం, పొటాషియం, కాల్షియం) సమతుల్యం చేస్తాయి. మూత్రపిండాలు రెన్ అనే హార్మోన్ విడుదల చేయడం ద్వారా రక్తపోటును నియంత్రిస్తాయి.
ఈ కారణంతో...
ఎరిత్రోపోయెటిన్ హార్మోన్ ద్వారా ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మూత్రకండాలు ప్రేరేపిస్తాయి. విటమిన్ డి ని ఉత్పత్తి చేసి, కాల్షియం పెరుగుదలకు ఉపయోగపడతాయి. మూత్రపిండాలు చెడిపోవడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనవి అధిక ఉప్పు మరియు చక్కెర తీసుకోవడం. తక్కువ నీరు తాగడం. అధిక మద్యం మరియు ధూమపానం సేవించడం. అధిక రక్తపోటు మరియు మధుమేహం కూడా మూత్రపిండాలు చెడిపోవడానికి కారణమవుతాయి. అధిక కొవ్వు మరియు ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం. నిర్లక్ష్యంగా జీవితాన్ని గడపటం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ మందులు వినియోగించడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని వైద్యులు చెబుతున్నారు.
కాపాడుకోవాలంటే?
ఇక మూత్రపిండాలు కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, మోతాదులో ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. – రోజుకు కనీసం 30 నిమిషాలపాటు నడక లేదా వ్యాయామం చేయాలి. మద్యం, ధూమపానం మానేయాలి. అధిక రక్తపోటు మరియు మధుమేహాన్ని నియంత్రించుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అయితే మూత్ర పిండాల సమస్యలను ముందుగా గుర్తించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖం, చేతులు, కాళ్ల విపరీతమైన వాపు కనపడుతుంది. తరచూ అలసట, నీరసంగా అనిపిస్తుంది. మూత్రంలో రక్తపు లేఖలు కనిపించడంతో పాటు మూత్రం రంగు మారడం లేదా దుర్వాసన రావడం వంటి కారణాలతో పాటు తక్కువ ఆకలి, మలబద్ధకం, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మూత్రపిండాలను కాపాడుకోవాలంటే యాపిల్, నేరేడు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ పండ్లను తినాలి. క్యాబేజి, బెల్లమా, క్యారట్ కూరలను ఎక్కువగా తినాలి. ఉసిరి, బొప్పాయ మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. తరచూ పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇది వైద్యులు సూచించిన సూచనలు మాత్రమే.
Next Story